»   » రామ్ చరణ్ ఎప్పుడూ అదే ద్యాస..టెన్షన్ టెన్షన్...!?

రామ్ చరణ్ ఎప్పుడూ అదే ద్యాస..టెన్షన్ టెన్షన్...!?

Posted By:
Subscribe to Filmibeat Telugu

చిరంజీవి తనయుడు రామ్ చరణ్ గురించి పుత్రోత్సాహంతో చిరు చెప్పిన మాటలివి. 'మగధీర" చిత్రం రిలీజ్ తర్వాత చాలా టెన్షన్ పడుతూ చిరంజీవి దగ్గరకు వెళ్ళిన చరణ్ 'నాన్నా..డ్యాన్సులు చేసేసాను. ఫైట్స్ చేసేశాను. నాకొచ్చిన హార్స్ రైడింగ్ నీ చూపించేశాను. ఇక నెక్స్ట్ మూవీస్ లో ఏం చెయ్యాలో, ఇంకెలా అభిమానులను శాటిస్ ఫై చెయ్యాలో అర్థం కావట్లేదు" అన్నాడట.

దానికి చిరంజీవి చెప్పిన సలహా ఏమిటంటే..'ఏం చేసినా నీ స్టైల్ లో నువ్వు చెయ్. ఏం చేస్తున్నా అది చేసేముందు అభిమానుల స్పందనని గుర్తు తెచ్చుకో. నీ హార్డ్ వర్క్ నువ్వు చేస్తూ వుంటే రావాల్సిన రిజల్ట్ వస్తూనే వుంటుంది" అన్నారట. ఇదంతా చెబుతూ తనలాగే సుపుత్రుడికీ సినిమాపైనే ద్యాస ఎక్కువని మురిసిపోయారు చిరు.

అయితే మగధీర తర్వాత రాజమౌళి కూడా అదే టెన్షన్ తో మగధీర లాంటి హైఎస్ట్ సినిమా తీయాల, లేక మర్యాద రామన్న లాంటి లోయేస్ట్ సినిమా తీయాలా లేక ఛత్రపతి లాంటి మాస్ సినిమా తీయాలో తెలియక తర్జన భర్జన పడుతున్నాడని. ఇప్పట్లో ఏ సినిమాకి దర్శకత్వం వహించలేదని సమాచారం. మరి మగధీర, హీరో, మగధీర డైరెక్టర్ ఎలాంటి రిజల్ట్ ఇస్తారో మరికొద్ది రోజులు వేచి చూడాల్సిందే.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu