»   » 'మగధీర' చూసి ఇంప్రెస్ అయ్యే ఆఫర్...?

'మగధీర' చూసి ఇంప్రెస్ అయ్యే ఆఫర్...?

Posted By:
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  హైదరాబాద్: రామ్ చరణ్ కెరీర్ లో సూపర్ హిట్ గా నిలిచిన చిత్రం 'మగధీర'. ఈ చిత్రం ఇప్పుడు రామ్ చరణ్ కి ఆఫర్ తెచ్చిపెట్టడానికి కారణమైందని తెలుస్తోంది. రామ్‌చరణ్‌ ఇటీవలే హిందీకి వెళ్లి తన అదృష్టాన్ని పరీక్షించుకొన్నారు... 'జంజీర్‌' చిత్రంతో. దానికి సరైన ఫలితం దక్కకపోయినా... చరణ్‌ ప్రతిభపై మాత్రం అక్కడి దర్శకులు భారీగానే ఆశలు పెట్టుకొన్నట్టున్నారు.

  అందుకే ఇటీవల చరణ్‌ దగ్గరకి కథలు విరివిగా వస్తున్నాయట. ప్రముఖ దర్శకుడు అశుతోష్‌ గోవారికర్‌ కూడా రామ్‌చరణ్‌ కోసం ఓ కథని సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. చారిత్రక నేపథ్యంతో కూడిన ఈ సినిమాలో చరణ్‌ నటిస్తేనే బాగుంటుందని అశుతోష్‌ భావిస్తున్నారట. 'మగధీర' చిత్రాన్ని చూశాక ఆయన ఈ నిర్ణయానికొచ్చినట్టు తెలుస్తోంది.ఇందుకోసం ప్రత్యేకంగా మగధీర ప్రింట్ తెప్పించుకుని మరీ చూసాడని చెప్తున్నారు. రామ్ చరణ్ కూడా ఆయనతో చేయాలని ఆసక్తితో ఉన్నారని అంటున్నారు.

  ఇక ఈ చిత్రం భారీవ్యయంతో ఈ చిత్రం రూపొందబోతున్నట్టు సమాచారం. చారిత్రాత్మక అంశాలతో సినిమాలు తీయడంలో అశుతోష్‌ ముందుంటారు. ఇదివరకు ఆయన 'లగాన్‌', 'జోథాఅక్బర్‌' అనే చిత్రాల్ని తెరకెక్కించారు. 'లగాన్‌' ఆస్కార్‌ పురస్కారాన్ని తృటిలో కోల్పోయింది. ఇప్పుడు మరో చారిత్రిక కథాంశంతో అశుతోష్ ముందుకు వచ్చారని తెలుస్తోంది. తెలుగు,హిందీ మార్కెట్ లకు రామ్ చరణ్ అయితే వర్కవుట్ అవుతాడని భావించే ఈ నిర్ణయం తీసుకున్నాడంటున్నారు.

  ఈ సినిమా భారీ బడ్జెట్ తో తెరకెక్కే పీరియడ్ డ్రామాగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. అలాగే ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనుల కోసం కొంత టైం తీసుకొంటుందని అంటున్నారు. ఈ సినిమా 2014 చివర్లో గానీ లేదా 2015 మొదట్లో గానీ మొదలయ్యే అవకాశం ఉంది. ఈ సినిమాకి సంబందించిన మిగతా వివరాలు తెలియాల్సి ఉంది.

  English summary
  Ram Charan Teja has bagged a big Bollywood offer, a dream offer of sorts. He will soon be working with Oscar nominee and director of ‘Lagaan’, Ashutosh Gowariker. Ashutosh is known for his big budget flicks and period dramas like ‘Lagaan’, ‘Swades’ and ‘Jodha Akbar’. It is said that he will be doing a period drama on a south Indian prince and warrior which will also be a big budget film. And for this he has chosen Ram Charan to play the main role. If everything goes as per plans, the film will go on to sets late 2014.
 
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more