»   » రామ్ నెక్ట్స్ ఖరారు, 'నేను-శైలజ' తర్వాత కమిటైంది ఇదే

రామ్ నెక్ట్స్ ఖరారు, 'నేను-శైలజ' తర్వాత కమిటైంది ఇదే

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: వరస ఫ్లాఫుల తర్వాత హీరో రామ్..నేను శైలజ చిత్రం హిట్ తో ఒడ్డున పడ్డాడు. దాంతో ఇక మళ్లీ ఫ్లాఫుల నాటి పరిస్దితి రిపీట్ కాకూడదనుకుంటున్నారు. ఈ మేరకు ఆయన కథలు వినటం, స్క్రిప్టుల మీద వర్క్ చేయటం చేస్తున్నారు. తాజాగా ఓ దర్శకుడుని ఓకే చేసినట్లు సమాచారం.

ఆ దర్శకుడు మరెవరో కాదు గతంలో రామ్ కు కందిరీగ వంటి సూపర్ హిట్ ఇచ్చిన వాసు. 14 రీల్స్ బ్యానర్ పై ఈ చిత్రం రూపొందనుందని సమాచారం. 14 బ్యానర్ లో రామ్ డేట్స్ ఉన్నాయి. అక్కడ వాసు కథ చెప్పి అటు నుంచి రామ్ దగ్గరకు వచ్చి ఓకే చేయించుకున్నట్లు తెలుస్తోంది.

Ram collaborates with his 'Kandireega' director again

నేను శైలజ హిట్ తో రామ్ చేయబోయే తదుపరి చిత్రం బిజినెస్ ఖచ్చితంగా బాగుంటుంది. అలాగే కందిరీగ కాంబినేషన్ అనగానే క్రేజ్ క్రియేట్ అవుతుంది. ఇవన్నీ పరిగణనలకి తీసుకునే రామ్ ఈ ప్రాజెక్టు ఓకే చేసినట్లు చెప్తున్నారు.

వాస్తవానికి తన రెండో చిత్రం కూడా రామ్ నే డైరక్ట్ చేయాల్సింది వాసు. అయితే అప్పట్లో నిర్మాత బెల్లంకొండ సురేష్ తో వచ్చిన విభేధాలతో రభస చేసారు. ఆ సినిమా డిజాస్టర్ తో గ్యాప్ తీసుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు మళ్లీ నేను శైలజ ని మించే కథతో రామ్ ని ఎప్రోచ్ అయ్యారని అందుకే రామ్ ఇమ్మిడియట్ గా ఓకే చేసాడని అంటున్నారు.

English summary
Santosh Srinivas would again team up with hero Ram. Currently in discussion stage, the project is expected to materialise soon.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu