రామ్ గోపాల్ వర్మకి నరకం చూపించిన సూపర్ స్టార్...!?
రామ్ గోపాల్ వర్మ నోటి నుంచి ఎప్పుడు ఎటువంటి వ్యాఖ్య వస్తుందో చెప్పలేం. ఆయన వ్యాఖ్యలు చాలా సూటిగా సుత్తి లేకుండా ఉంటాయని చాలామంది చెపుతుంటారు. ఒక్కోసారి ఈ సూటి వ్యాఖ్యలు మరింత ఘాటుగా కూడా ఉంటాయి. ఆదివారంనాడు హైదారాబాదులో తను రాసిన 'నా ఇష్టం' పుస్తక ప్రచురణకర్త ఎమ్మెస్కో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. పుస్తక ప్రియులు ఒకరు బిగ్ బీపై ఓ ప్రశ్న అడగ్గానే వర్మ...ఆయన ఓ ఛండాలమైన నటుడని వ్యాఖ్యానించారు. అమితాబ్ తో పనిచేసినపుడు నరకం అనుభవించానని పేర్కొన్నారు. అటువంటి నటుడ్ని తన కెరీర్ లో ఇప్పటివరకూ చూడలేదన్నట్లు వర్మ వ్యాఖ్యానించారు.
రామ్ గోపాల్ వర్మ అమితాబ్ బచ్చన్ నా ఇష్టం అప్పల్రాజు ram gopal varma amitabh bachchan naa istam appalaraju


Click it and Unblock the Notifications