»   » వర్మ వరస ట్వీట్స్ ...ఏం పనుందో ఏంటో

వర్మ వరస ట్వీట్స్ ...ఏం పనుందో ఏంటో

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : రామ్ గోపాల్ వర్మ తనకు పర్శనల్ గా ఏదైనా పని అయినా ఉండాలి లేదా ఎదుటి వారిని గిచ్చాలి అనుకున్నప్పుడే మాత్రమే భజన ట్వీట్స్ చేస్తూంటారు. తాజాగా ఆయన నాగార్జున చిత్రం మనం ని వరసగా పొగుడుతూ ట్వీట్స్ చేస్తున్నారు. సినిమా బాగుంది..భాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ కూడా బాగున్నాయి. అంతగా అయితే వర్మ ఓ ట్వీట్ ఇస్తాడు కాని ఇలా కంటిన్యూగా ట్వీట్స్ ఇవ్వడు అంటున్నారు. శివ,గీతాంజలి, మనం ఒకటే అంటూ పొగడ్తల్లో ముంచెత్తుతున్నారు.

అయితే వర్మ అంతలా ఎక్సైట్ అయ్యి ట్వీట్స్ చేయటమే చిత్రం అంటున్నారు. అంటే నాగార్జునతో ఆయనకు ఉన్న రిలేషన్ తో ఈ ట్వీట్స్ చేస్తున్నారా లేక ఆయన తో ఏదన్నా పని ఉందా..డేట్స్ వగైరా అంటున్నారు. దానికి తోడు ఇప్పుడు అక్కినేని అఖిల్ కూడా ఎంట్రీ ఇస్తున్నాడుగా... అతన్ని పట్టడానికా అనే సందేహాలు సినీ వర్గాల్లో కలుగుతున్నాయి.

Ram Gopal Varma again about Manam

అలాగే కొద్ది రోజుల క్రితం... 'మనం'పై రాంగోపాల్ వర్మ ప్రశంసలు కురిపించారు. బాలీవుడ్ లో ఈ చిత్రం విడుదలై ఉంటే సులభంగా వంద కోట్ల రూపాయలు వసూలు చేసేందని వర్మ సోషల్ మీడియాలో ట్వీట్ చేశారు. ఏఎన్నాఆర్ తో తొలిసారి నాగార్జున నటించేటప్పడు తడబాటుకు గురయ్యాడు. అయితే నాగ చైతన్య విషయంలో అలాంటి జరగలేదని.. నాగార్జున కంటే నాగచైతన్యనే బెటర్ గా యాక్ట్ చేశారని వర్మ ట్వీట్ చేశారు. అయితే 'మనం' చిత్రాన్ని ఏఎన్నాఆర్ చూడలేకపోవడం అత్యంత విషాదకరమని వర్మ వ్యాఖ్యలు చేశారు.

రిలీజ్ కు ముందు కూడా రామ్ గోపాల్ వర్మ చిత్రం గురించి ట్వీట్ చేసారు. ఆ ట్వీట్ లో ' ఇప్పుడే మనం సినిమాకి సంబందించిన కొన్ని సీన్స్ చూసాను. తెలుగు సినిమా ఓ స్ధాయికి వెళ్తున్నందకు చాలా హ్యాపీగా ఉంది. మనం అనేది చిత్రం యెక్క అసలైన ఫీల్..ఇలాంటి సినిమాని చూలా కాలం అయ్యింది. విక్రమ్ చాలాలా టాలెంట్ ఉన్న దర్శకుడు, ఇలాంటి దర్శకుడుని నేను గత కొద్ది సంవత్సరాలుగా కలవలేదు అని ట్వీట్ చేసారు. అలాగే కంటిన్యూ చేస్తూ..ఈ సినిమా కోసం డిజైన్ చేసిన అక్కినేని, నాగార్జున, చైతన్య లుక్ చాలా ప్రెష్ గా ఉంమది. సినిమా అభిమానులు విక్రమ్ కోసం ఈ చిత్రం చూడవచ్చు 'అన్నారు.


విక్రమ్ కుమార్ దర్శకత్వం వహించిన 'మనం' చిత్రంలో నాగార్జున, నాగచైతన్య, అఖిల్ తోపాటు అమల, అమితాబ్ బచ్చన్ లు నటించారు. ఈచిత్రంలో సమంత, శ్రీయ హీరోయిన్లు. బ్రహ్మానందం, తనికెళ్ల భరణి, అలీ, ఎమ్మెస్ నారాయణ, జయప్రకాష్ రెడ్డి, పోసాని కృష్ణ మురళి, నాగినీడు, శరణ్య, కాశీవిశ్వనాథ్, రవిబాబు, వెన్నెల కిషోర్, మెల్కొటే ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈచిత్రానికి మాటలు : హర్షవర్ధన్, పాటలు : చంద్రబోస్, వనమాలి, డాన్స్ : బృంద, ఫైట్స్ : విజయ్, కాస్ట్యూమ్స్: నళిని శ్రీరామ్, ఫోటోగ్రఫీ : పి.ఎస్.వినోద్, సంగీతం : అనూప్ రూబెన్స్, ఆర్ట్ :రాజీవన్, ఎడిటింగ్ : ప్రవీణ్ పూడి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: వై.సుప్రియ, నిర్మాత : నాగార్జున అక్కినేని, కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం : విక్రమ్ కె.కుమార్.

English summary
RGV said, “Greatest about Manam success is that you fu**ed industry peoples belief that only cliches work by making originality work far better you did that by making Shiva happen in 1989 against all odds and now in 2014 making Manam happen against even more odds. You are the only responsible to make Tollywood take quantum leaps in new age new cinema- examples Geetanjali, Shiva and Manam.”
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu