»   » వైయస్ జగన్‌ పై సినిమా తీస్తే ఎలా ఉంటుందీ..?: సంచలనాల ధీరుడు

వైయస్ జగన్‌ పై సినిమా తీస్తే ఎలా ఉంటుందీ..?: సంచలనాల ధీరుడు

Posted By:
Subscribe to Filmibeat Telugu

నిజజీవితాలను తెరకెక్కిస్తూ ప్రేక్షకుల దృష్టిని తనవైపు తిప్పుకునే రాంగోపాల్ వర్మ మదిలో మరో కొత్త ఆలోచన పుట్టుక వచ్చినట్లు భోగట్టా. అదేమిటంటే... వైయస్ జగన్ జీవితంపై సినిమా తీయాలనుకోవడం. వైయస్సార్ మరణానికి ముందు, ఆ తర్వాత వైయస్ జగన్ రాజకీయ జీవితం ఎలా సాగిండన్న దానిపై వర్మ ఆరా తీస్తున్నట్లు సమాచారం. అన్నీ కుదిరితే 'వైయస్ జగన్ రాజకీయం' అనే పేరుతో వర్మ సినిమా తీయడానికి రెడీ అవుతున్నట్లు భోగట్టా. ఇలాంటి సినిమాలు తాను ఇంతవరకూ తీయలేదని అయితే అలాంటి సినిమా తీయాలంటే పొలిటికల్ మెకానిజం మరియు పొలిటికల్ సైకాలజి తెలిసుండాలి అంటున్నారు. ఇకపోతే ఇప్పటికే ప్రకటించిన బెజవాడ రౌడీలు చిత్రం స్క్రిప్టుపై వర్మ ప్రత్యేక దృష్టిలో పెట్టారు. ఈ చిత్రంలో టాలీవుడ్, కోలీవుడ్ చిత్ర పరిశ్రమకు చెందిన ఇద్దరు అగ్రహీరోలు నటిస్తారని సమాచారం.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X