»   » ఇలియానాకు బాలీవుడ్ ఛాన్స్ వెనక సెన్సేషన్ డైరక్టర్?

ఇలియానాకు బాలీవుడ్ ఛాన్స్ వెనక సెన్సేషన్ డైరక్టర్?

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఇలియానా త్వరలో బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతోంది. అనురాగబసు దర్శకత్వంలో రణ్ బీర్ కపూర్ హీరోగా రూపొందనున్న బఫ్రీ చిత్రం ఆమె కమిటయ్యింది. అయితే ఈ బాలీవుడ్ ఛాన్స్ వెనక రామ్ గోపాల్ వర్మ హస్తముందని తెలుస్తోంది. వర్మ ఆ మధ్యన చాలా కాలం తర్వాత తెలుగు ఇండస్ట్రీకి దొరికిన అధ్బుతం అన్నట్లు ఇలియానా గురించి ట్వీట్ చేసి అందరినీ షేక్ చేసారు. ఆ ట్వీట్ లో...ది బెస్ట్ ధింగ్ ఎబౌట్ ది తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఇన్ ది లాస్ట్ సో మెనీ మెనీ ఇయర్స్ ఈజ్ ఇలియానా..అన్నారు. ఆయన తన ట్విట్టర్ లో, పర్శనల్ బ్లాగ్ లో ఇలియానా భజన చేయటంతో కొంత బాలీవుడ్ దృష్టి ఆమెపై పడటానికి కారణమైందని, అలాగే తనకున్న పరిచయాలను కూడా వర్మ ఆమె కోసం వినియోగించాడని చెప్పుకుంటున్నారు. అందులోనూ దర్శకుడు అనురాగబసు ..గతంలో వర్మతో పనిచేసినవాడే కావటం కూడా ప్లస్ అయ్యిందంటున్నారు. ఇక ప్రస్తుతం ఇలియానా..వర్మ శిష్యుడు పూరీ జగన్నాధ్ దర్శకత్వంలో నేనూ..నా రాక్షసి అనే చిత్రంలో రానా సరసన చేస్తోంది. అలాగే మహేష్ సరసన త్రీ ఇడియట్స్ రీమేక్ కి కమిటైంది. మరో ప్రక్క ఆమె ఎన్టీఆర్ సరసన మెహర్ రమేష్ దర్సకత్వంలో చేస్తున్న శక్తి చిత్రం విడుదలకు రెడీ అవుతోంది.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu