మునుపెన్నడూ చేయని జోనర్ లో రామ్ సినిమా... లింగుస్వామి ప్లాన్ మామూలుగా లేదే!
నేను శైలజ సినిమా తర్వాత హిట్ కొట్టడానికి చాలా ప్రయత్నాలు చేసిన హీరో రామ్, పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ సినిమాతో హిట్ కొట్టి మళ్ళీ లైన్లోకి వచ్చాడు.. అయితే ఆ తర్వాత ఆయన చేసిన రెడ్ అనే ప్రయోగాత్మక సినిమా మళ్లీ నిరాశపరిచింది. నేను శైలజ సూపర్ హిట్ ఇచ్చిన కిషోర్ తిరుమలతో రెడ్ సినిమా చేయగా ఆ సినిమా ఆశించిన ఫలితాలను అందుకోలేకపోయింది.. ఈ నేపథ్యంలోనే రామ్ ఆచి తూచి అడుగులు వేస్తున్నాడు..
ఇప్పటికే ఆయన తమిళ దర్శకుడు లింగుస్వామి దర్శకత్వంలో ఒక సినిమా అనౌన్స్ చేశాడు. సమంత యూటర్న్, గోపీచంద్ సీటీమార్ సినిమాలను నిర్మించిన శ్రీనివాస చిట్టూరి నిర్మాణంలో ఈ సినిమా రూపొందబోతోంది. తాజాగా జరుగుతున్న ప్రచారం మేరకు ఈ సినిమా కథ పూర్తిగా ఫ్యాక్షన్ నేపథ్యంలో ఉండబోతుందని అంటున్నారు. 2005లో విశాల్ హీరోగా పందెంకోడి అనే సినిమాతో దర్శకుడు లింగుస్వామి సూపర్ హిట్ అందుకున్నారు. ఆ సినిమా పూర్తిగా ఫ్యాక్షన్ నేపథ్యంలోనే ఉంటుంది.

అయితే దీనికి కొనసాగింపుగా వచ్చిన పందెంకోడి 2 చిత్రం ప్రేక్షకులను నిరాశ పరిచింది. అయితే రామ్ కోసం కూడా ఆయన ఒక పవర్ ఫుల్ ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ కథ రాసుకున్నాడు అనే ప్రచారం ఇప్పుడు టాలీవుడ్ వర్గాల్లో జరుగుతోంది.. రామ్ కి కూడా ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ బాగా నచ్చడంతో కథ విన్న వెంటనే ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని అంటున్నారు.ఇక ఇప్పటికే ఈ సినిమాలో హీరోయిన్ గా కృతి శెట్టి ఎంపికైన సంగతి తెలిసిందే. కాస్త కరోనా పరిస్థితులు కుదుటపడ్డాక ఈ సినిమా షూటింగ్ మొదలయ్యే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. దర్శకుడిగా మారి 20 ఏళ్లు పూర్తయిన నేపథ్యంలో చెన్నైలో ఒక కరోనా ఆశ్రమాన్ని కూడా ఆయన మొదలుపెట్టారు.


Click it and Unblock the Notifications











