»   » ఫ్లాఫ్ దర్శకుడుతో రామ్ నెక్ట్స్ ఖరారు

ఫ్లాఫ్ దర్శకుడుతో రామ్ నెక్ట్స్ ఖరారు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: వరసగా మూడు డిజాస్టర్ ఫ్లాపులు(ఎందుకంటే ప్రేమంట,ఒంగోలు గిత్త,మసాలా) అందించిన రామ్ మరో చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ సారి రవితేజ వంటి ఎనర్జిటిక్ హీరోతో అతని కెరీర్ లోనే బిగ్గెస్ట్ ఫ్లాప్ అయిన సారొస్తారు వంటి డిజాస్టర్ చిత్రం తీసిన పరుశరామ్ తో చిత్రం చేయటానికి సిద్దమవుతున్నట్లు ఫిల్మ్ నగర్ సమాచారం. రెండు మైనస్ లు కలిస్తే ఓ ప్లస్ అవుతుందనే నమ్మకంతో ఈ ప్రాజెక్టు చేపడుతున్నట్లు చెప్పుకుంటున్నారు.

పరుసరామ్ తో ఇంతకుముందు నాగచైతన్య,అల్లు అర్జున్ తో చిత్రం అనుకున్నారు. కానీ అవేమీ మెటిరియలైజ్ కాలేదు. స్రవంతి రవికిషోర్ నిర్మించే ఈ చిత్రం స్క్రిప్టు వర్క్ ప్రస్తుతం జరుగుతోంది. ఈ చిత్రానికి వెలిగొండ శ్రీనివాస్ కథ అందిస్తున్నారు. వెలిగొండ శ్రీనివాస్ గతంలో...తిన్నామా ..పడుకున్నామా ...తెల్లారిందా, ఢమురం చిత్రానికి కథ అందించారు. జబర్ధస్త్,సమ్ థింగ్ సమ్ థింగ్ చిత్రాలకి మాటలు ఇచ్చారు.

స్క్రిప్ట్ విషయంలో రకరకాల జాగ్రత్తలు తీసుకుంటాను అని చెప్పే రామ్ గత కొంతకాలంగా స్క్ర్రిప్టుల ఎంపికలో తడబడుతున్నారు. ఈ విషయమై రామ్ మాట్లాడుతూ... నాకు స్క్రిప్ట్ నచ్చితే ఏడాది దాటాక కూడా చిన్న చిన్న విషయాలు చెప్పగలను. నాకు నచ్చకపోతే చిన్న విషయం కూడా చెప్పలేను. ఎవరైనా స్క్రిప్ట్ చెప్తుంటే నాలుగైదు విధాల ద్వారా ఆలోచిస్తాను. కధ చెప్పే వాడు ఆరవ విధంగా చెప్తే నాకు నచ్చుతుంది. నాకు ఎంటర్టైన్మెంట్ అంటే ఇష్టం అన్నారు.

ఫ్లాపులు గురించి మాట్లాడుతూ.. నేను బాధపడనని చెప్పలేను. కాకపోతే తప్పక హిట్ అవుతుందన్న సినిమా ఫ్లాప్ అయితే బాధ వేస్తుంది సినిమా ఒప్పుకునే ముందు స్క్రిప్ట్ నూ దర్శకుడినో నమ్ముతాను లేదా నమ్మిస్తారు. ఒక్కోసారి దర్శకుడు చెప్పిన విషయం నాకు నచ్చకపోయినా అతని మీద నమ్మకంతో ఒప్పుకుంటాను. కానీ ఒకోసారి అవి ఫలించవు. జగడం తరువాత నేను చాలా భాధలో వున్నాను. "ప్రేమించిన అమ్మాయిని ఇంట్లో ఒప్పుకోకపోతే ఎంత బాధ వస్తుందో అంతా బాధగా". నా కెరీర్ లో చాలా ఒడిదుడుకులు ఎదురుకున్నా. నేను స్టాక్ మార్కెట్ లాంటి వాడిని. ప్రస్తుతం నా తప్పులను తెలుసుకుని నేను ఆనందంగా వున్నాను అని చెప్పుకొచ్చారు.

ఇక ప్రయోగాత్మక సినిమాల గురించి చెప్తూ..అందరి దర్శకులకి నన్ను చూస్తే ప్రయోగాలు చెయ్యాలనిపిస్తుంది. ఉదాహరణకు నేను కరుణాకరన్ తో ప్రేమకధను చేయాలనుకున్నా. కానీ అతను నాతొ వేరే విధమైన సినిమా తీసాడు. ఇదివరకే ఇలాంటివి మరొకటి జరిగింది. నేను దర్శకులను ఉత్తేజపరచడం నాకు నచ్చింది. చిన్న బడ్జెట్ సినిమాల విషయానికొస్తే మనకి భారీ నిర్మాణ విలువలతో, భారీ సెట్లనడుమ చూడడం ఇష్టం. తమిళ మరియు మలయాళం వారికి వేరే సంస్కృతి. ఎవరి ఇష్టాలు వాళ్ళకి వుండడం సహజం అన్నారు.

English summary
Ram gave green signal to another film which will be directed by Parasuram who directed Raviteja's Sarochcharu. Sravanthi Ravikishore will be producing the film for which scriptwork is underway. Selection of rest of the cast and crew is going on. Official announcement is expected soon.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu