»   » బాలకృష్ణ సినిమాలో గెస్ట్ గా ఆ స్టార్ ప్రొడ్యూసర్!?

బాలకృష్ణ సినిమాలో గెస్ట్ గా ఆ స్టార్ ప్రొడ్యూసర్!?

Posted By:
Subscribe to Filmibeat Telugu

స్టార్ ప్రొడ్యూసర్, మూవీ మొఘల్ అయిన డి.రామానాయుడు త్వరలో ఓ కీలకమైన పాత్రను బాలకృష్ణ చిత్రంలో చేయనున్నారు. బాలకృష్ణ,దాసరి నారాయణరావు కాంబినేషన్ లో రూపొందుతున్న పరమ వీర చక్ర చిత్రం కోసం ఈ పాత్రను చేయటానికి రామానాయుడు ఒప్పుకున్నారు. ఆ పాత్ర మరేదో కాదు ఆర్మీ జనరల్ గా ఓ విశిష్టమైన పాత్ర. ఇక దాసరి నారాయణ రావుకిది 150 వ చిత్రం. అలాగే బాలకృష్ణకు చిరకాల విరామ తర్వాత సింహా రూపంలో ఘన విజయం రావటంతో దాన్ని కంటిన్యూ చేయాలనే ఆలోచనలో ఉన్నారు. ఇక బాలకృష్ణ ఈ చిత్రం కాక బి.గోపాల్ దర్శకత్వంలోనూ, పరుచూరి మురళి డైరక్షన్ లోనూ చేయటానికి కమిట్ అయ్యారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu