»   »  'దొంగ సచ్చినోళ్లు' పై రంభ ఫిర్యాదు

'దొంగ సచ్చినోళ్లు' పై రంభ ఫిర్యాదు

Posted By:
Subscribe to Filmibeat Telugu
Rambha
అందాల ఆరబోతలో ముందుండే రంభ తాను నటించిన తాజా చిత్రం 'దొంగసచ్చినోళ్లు' నిర్మాతలపై మూవీ ఆర్టిస్టుల సంఘానికి ఫిర్యాదు చేసింది. తనను ఆ నిర్మాతలు మోసం చేశారని, రెమ్యునరేషన్ పూర్తిగా చెల్లించలేదని ఆమె ఫిర్యాదు చేసింది. నిర్మాతలకు తనకు ఇంకా రెండు లక్షల రూపాయలు చెల్లించాల్సి ఉందని చెబుతోంది. ఆ మొత్తానికి తనకు ఇచ్చారని, అయితే ఆ చెక్కు చెల్లలేదని ఆమె తెలియజేసింది. కామెడీ చిత్రమైన దొంగ సచ్చినోళ్లులో కృష్ణ భగవాన్, రఘుబాబు ముఖ్యపాత్రలు పోషించారు. రంభ హీరోయిన్ పాత్రలో నటించింది. రాజా వన్నం రెడ్డి దర్శకత్వం వహించారు. షూటింగ్ పూర్తయినప్పటికీ తనకు ఇవ్వాల్సిన సొమ్మును చెల్లించలేదని రంభ ఆవేదన.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X