twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    తండ్రి రాజకీయంపై...రామ్ చరణ్ మౌనం

    By Bojja Kumar
    |

    టాలీవుడ్ తారల్లో చాలా మంది సోషల్ నెట్వర్కింగ్ సైట్ల ద్వారా ఫ్యాన్స్ కు టచ్ లో ఉండటం కొంతకాలంగా మనం చూస్తూనే ఉన్నాం. వారి వారి సినిమాల గురించి, తమ యాక్టివిటీస్ గురించి అభిమానులకు తెలియ జేస్తూ...ఫ్యాన్స్ తో క్లోజ్ రిలేషన్ షిప్ మెయింటెన్ చేస్తున్నారు. వీరిలో మెగా తనయుడు రామ్ చరణ్ కూడా ఒకరు. ఆరెంజ్ సినిమాకు ముందు నుంచే ట్విట్టర్‌లో అకౌంట్ ఓపెన్ చేసిన చరణ్....తన సినిమాలకు సంబంధించిన విషయాలను, తన కుటుంబానికి సంబంధించిన అనేక ఆసక్తికర అంశాలను అభిమానులతో షేర్ చేసుకోవడంతో పాటు...దీని ద్వారానే దాసరి లాంటి పెద్ద దర్శకులపై విమర్శలు సంధిస్తూ వస్తున్నాడు.

    అన్ని విషయాలు ఫ్యాన్స్ తో ఓపెన్ గా డిస్కస్ చేస్తున్న చరణ్....తన తండ్రి చిరంజీవి గురించి గానీ, ఆయన చేస్తున్న రాజకీయాల గురించి అసలు డిస్కస్ చేయడమే లేదు. చిరంజీవి ప్రజారాజ్యం స్థాపించడం దగ్గర నుంచి కాంగ్రెస్ లో విలీనం అయ్యే వరకు అనేక పరిణామాలు చోటు చేసుకున్నాయి. దీనిపై మెగా అఃభిమానుల్లో అనేక అనుమానాలు, అభ్యంతరాలు ఉన్నాయి. అయితే వీటినీ చరణ్ తో షేర్ చేసుకోవడానికి ప్రయత్నిస్తున్న అభిమానులకు నిరాశే ఎదురవుతుంది.

    మరి తండ్రి చేస్తున్న రాజకీయంపై...చరణ్ ఎందుకు మౌనంగా ఉన్నాడు? అంటే ఒకటే సమాధానం వినిపిస్తోంది. ఆ మధ్య దాసరిపై కామెంట్లు చేసిన చరణ్ పై చిరు సీరియస్ గా స్పందించి క్లాస్ పీకాడు. అదే సమయంలో తన రాజకీయాల జోలికి కూడా రావద్దని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడట. అందుకే తండ్రి రాజకీయాల జోలికి పోకుండా మౌన మంత్రాన్ని పాటిస్తున్నాడట చరణ్.

    English summary
    It is heard that recently, many of them were eagerly following Charan’s twitter account. Well, they wanted to know his reaction on his father’s joining the Congress party. Much to everyone’s surprise, there was no mention about Chiru’s political act. Though many things are happening, Charan is silent.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X