»   » తన అన్నకు ఈ సారన్నా మహేష్ హిట్టిస్తారా?

తన అన్నకు ఈ సారన్నా మహేష్ హిట్టిస్తారా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

గతంలో తన సోదరుడు మహేష్ తో అర్జున్, అతిధి చిత్రాలను నిర్మించిన రమేష్ బాబు మరోసారి రంగంలోకి దిగుతున్నారు. మహేష్ హీరోగా శ్రీను వైట్ల దర్శకత్వంలో ప్లాన్ చేస్తున్న నూతన చిత్రంలో రమేష్ బాబు కో ప్రొడ్యూసర్ గా వ్యవహించనున్నారని సమాచారం. ఇక ఈ చిత్రాన్ని వెంకటేష్ తో నమో వెంకటేశ చిత్రం రూపొందించిన అనీల్ సుంకర, నిర్మాత ఆచంట గోపీచంద్ కలిసి నిర్మిస్తున్నారు. ఇక రమేష్ బాబు ఎంట్రీతో ముగ్గురు కలిసి ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేస్తున్నట్లు అయింది. ఇక కామిడీ ఎంటర్టైనర్ గా రూపొందే ఈ చిత్రం త్వరలోనే సెట్స్ పైకి వెళ్ళనుంది. ఈ చిత్రం కోసం సూపర్ 35 ఎంఎం కెమెరాను ఉపయోగిస్తున్నారు. అలాగే ఈ చిత్రంలో హీరోయిన్ గా సమంత ను తీసుకున్నారు. సమంత హీరోయిన్ గా చేసిన ఏ మాయ చేసావే చిత్రం మంచి హిట్ టాక్ తెచ్చుకున్న సంగతి తెలిసిందే. ఇక మహేష్ ప్రస్తుతం త్రివిక్రమ్ తో కలేజా అనే చిత్రం రూపొందిస్తున్నారు. ఇక రమేష్ బాబు తన సోదరుడు మహేష్ తో చేసిన అర్జున్, అతిధి చిత్రాలు ఫెయిల్యూర్ అయ్యయి. దాంతో ఈ సారన్నా సక్సెస్ అవ్వాలని కోరుకుందాం.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu