»   » రీసెంట్ గా డిజాస్టర్ ఇచ్చిన డైరక్టర్ తో బెల్లంకొండ సురేష్ సినిమా

రీసెంట్ గా డిజాస్టర్ ఇచ్చిన డైరక్టర్ తో బెల్లంకొండ సురేష్ సినిమా

Posted By:
Subscribe to Filmibeat Telugu

రీసెంట్ గా వీర అనే చిత్రంతో డిజాస్టర్ సినిమాని ఇచ్చిన దర్శకుడు రమేష్ వర్మకు మరో సినిమా సెట్ అయినట్లు సమాచారం.ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ ఈ దర్శకుడుకి ధైర్యంతో ఆఫర్ ఇస్తున్నారు.గతంలో తనకు శ్రీశ్రీ అనే టైటిల్ తో చెప్పిన కథను పూర్తిగా విన్న బెల్లంకొండ వెంటనే గ్రీన్ సీగ్నల్ ఇచ్చారని,త్వరలోనే ఎనౌన్స్ మెంట్ వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.ఇక బెల్లంకొండ గతంలోనే రమేష్ వర్మ ప్రతిభకు ముగ్ధుడై బాలయ్యను డైరక్ట్ చేయమని భీష్మ సినిమా ఆఫర్ ఇచ్చాడు.అయితే అది వర్కవుట్ కాలేదు.అయితే అంతకుముందు బెల్లంకొండకు రమేష్ వర్మ రైడ్ అనే హిట్ ఇచ్చి ఉండటం కలిసివచ్చిన అంసం అంటున్నారు. ఇక శ్రీశ్రీ అనే ఈ ప్రాజెక్టు ఓ లవ్ స్టోరీ అని శ్రీను..శ్రీలక్ష్మి అనే టైటిల్ కి ఇది షార్ట్ ఫామ్ అని,ఇందులో సిద్దార్ద నటించే అవకాశం ఉందని ఫిల్మ్ నగర్ సమాచారం.

English summary
Ramesh Varma who directed ‘Veera’ recently is hitting floors shortly with his dream project ‘Sri Sri’. Bellamkonda Suresh is producing it.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu