»   » రుద్రాక్ష... రమ్యకృష్ణ ని రక్షిస్తుందా?

రుద్రాక్ష... రమ్యకృష్ణ ని రక్షిస్తుందా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: రమ్యకృష్ణ త్వరలో రుద్రాక్ష టైటిల్ తో రూపొందనున్న చిత్రంలో నటించనుందని సమాచారం. ఆమె భర్త కృష్ణవంశీ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందనుంది. వివాహానికి ముందు ఆమె కృష్ణ వంశీ దర్శకత్వంలో చంద్రలేఖ చిత్రం చేసింది. ఇప్పుడు మరోసారి ఆమె ఇలా రుద్రాక్ష చిత్రం చేస్తోంది.

రీసెంట్ గా బాహుబలి చిత్రంలో శివగామిగా అదరకొట్టి మళ్లీ క్రేజ్ సంపాదించుకున్న ఆమె సోగ్గాడే చిన్ని నాయినా చిత్రంలోనూ నాగార్జున కు జోడిగా చేసి సినిమా విజయంలో తన వంతు పాత్రను పోషించింది. దాంతో కృష్ణవంశీ ఆమెను తన తాజా చిత్రంలో తీసుకున్నారు.

Ramya Krishna in Krishnavamsi's Rudraksha

అయితే ఈ చిత్రం హర్రర్ చిత్రం అని తెలుస్తోంది. రమ్యకృష్ణ క్రేజ్ ..ఈ చిత్రానికి బాగా ప్లస్ అవుతుంది. అలాగే కృష్ణ వంశీ గ్యాప్ తర్వాత చేస్తున్న చిత్రం కావటంతో సినిమాపై పూర్తి శ్రద్ద పెడతారని, ఆమెను ఇంతవరకూ చూపని పాత్రోలో చూపించనున్నారని చెప్తున్నారు.

సమంత హీరోయిన్ గా చేస్తున్న ఈ చిత్రంలో రమ్యకృష్ణ కీ రోల్ లో కనపడనుంది. దిల్ రాజు నిర్మించే ఈ చిత్రం ఈ చిత్రం మీడియం బడ్జెట్ లో తెరకెక్కనుంది. బిజినెస్ పరంగా కూడా రమ్యకృష్ణకు ఉన్న క్రేజ్, హర్రర్ చిత్రం కావటం, కృష్ణవంశీ దర్శకత్వం కావటం కలిసొచ్చే అంశాలు.

English summary
Krishnavamsi who has refrained from taking his wife Ramyakrishna in his films all these years, has now approached her for his new film titled Rudraksha.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu