»   » ‘బాహుబలి’ తల్లి శ్రీదేవి కాదు..మరి?

‘బాహుబలి’ తల్లి శ్రీదేవి కాదు..మరి?

Posted By:
Subscribe to Filmibeat Telugu
హైదరాబాద్ : ప్రభాస్ హీరోగా రాజవౌళి దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న 'బాహుబలి' చిత్రం పలు సంచలనాలకు కేంద్ర బిందువవుతోంది. ఈ చిత్రంలో బాహుబలికి తల్లిగా నటించడానికి మంచి గుర్తింపు ఉన్న హీరోయిన్ కావాలి. అది ఎవరు? అని చాలా రోజులుగా పలురకాల ఊహాగానాలు విన్పిస్తున్నాయి. ఆ మధ్యన ఆ పాత్రలో విశ్వసుందరిగా ఎన్నికై, రక్షకుడు చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన సుస్మితాసేన్ నటించనుందని అన్నారు. ఆ తర్వాత శ్రీదేవి ఆ పాత్ర చేయనుందని వార్తలు వచ్చాయి. అయితే ఫైనల్ గా రమ్యకృష్ణని ఆ పాత్రకు ఎంపిక చేసి షూట్ చేస్తున్నారు.

దాదాపుగా రమ్యకృష్ణ ఫేడ్ అవుటు అయిపోయిన తరుణంలో 'బాహుబలి' చిత్రంలో హీరో తల్లిగా నటించనుందన్న వార్తతో తెరపైకి వచ్చింది . దర్శకుడు రమ్య కృష్ణకు చిత్రంలోని ప్రధాన కథను, ఆమె పాత్రలో విశిష్టతను చెప్పడంతో, దాదాపు కోటి రూపాయల పారితోషికాన్ని ఇవ్వజూపడంతో ఈ పాత్రను చేయడానికి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిందని సమాచారం. ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ ..రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది.

ప్రభాస్, దర్శకుడు రాజమౌళి కాంబినేషన్లో రూపొందుతున్న 'బాహుబలి' లో తంగబల్లి నటించనున్నాడు. తంగబల్లి అనేది.. చెన్నై ఎక్సప్రెస్ చిత్రంలో విలన్ పాత్ర పేరు. ఆ పాత్ర వేసిన నిఖిటిన్ ధీర్ ...ని ఈ చిత్రానికి ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. బాహుబలిలో కీలక పాత్ర చేస్తున్న సత్యరాజ్ రికమెండేషన్ మీద ఓ కీలకమైన పాత్రను అతన్ని ఎంపిక చేసినట్లు చెప్పుకుంటున్నారు. నిన్నటి నుంచి రామోజీ ఫిల్మ్ సిటీలో ఈ చిత్రం షూటింగ్ మొదలైంది.


మూవీ తొలి షెడ్యూల్ పూర్తి చేసుకుని రెండో షెడ్యూల్‌కు రెడీ అవుతోంది. తొలి షెడ్యూల్‌లో కర్నూలు సమీపంలోని కొండ ప్రాంతాల్లో ఇటీవల కొన్ని సీన్లు చిత్రీకరించారు. రానా దగ్గుబాటి ఈ సినిమాలో ప్రభాస్ కి బ్రదర్ గా కనిపించనున్నాడు. అనుష్క హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో తమిళ నటుడు సత్యరాజ్ ఓ కీలక పాత్రలో కనిపించనున్నాడు. ఈ సినిమా ఇండియాలోనే ఏ సినిమా తెరకక్కనంత అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోంది. ఎం.ఎం కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ సినిమాకి సెంథిల్ కుమార్ సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తున్నాడు.


సినిమా పూర్తయి ప్రేక్షకుల ముందుకు రావడానికి మరో రెండేళ్ల సమయం పట్టనుంది. బాహుబలి చిత్రంలో ప్రభాస్‌ సరసన అనుష్క హీరోయిన్‌గా నటిస్తుండగా రాణా ప్రతినాయకుడి పాత్ర పోషిస్తున్నాడు. ఈ చిత్రం కోసం 'arri alexa XT' కెమెరాలను ఉపయోగించనున్నారు. ఈచిత్రాన్ని తెలుగు, తమిళంలో ఒకేసారి చిత్రీకరిస్తున్నారు. అయితే హిందీ, మలయాళంతో పాటు ఇతర వీదేశీ భాషల్లోనూ విడుదల చేయాలనే ఆలోచన చేస్తున్నారు.

ఈ చిత్రంలో గ్రాఫిక్స్ ప్రధాన భూమిక పోషించనున్నాయి. ఇండియన్ సినిమా చరిత్రలోనే గ్రేటెస్ట్ మూవీగా దీన్ని తీర్చిదిద్దేందుకు ట్రై చేస్తున్న రాజమౌళి....భారీ తారాగణాన్ని ఈ చిత్రం కోసం ఎంపిక చేస్తున్నాడు. 'బాహుబలి' చిత్రానికి కీరవాణి సంగీతం అందిస్తున్నారు. రమా రాజమౌళి కాస్ట్యూమ్స్ డిజైన్ చేస్తున్నారు. మగధీర, ఈగ సినిమాలకు సినిమాటోగ్రాఫర్ గా పని చేసిన సెంథిల్ కుమార్ ఈచిత్రానికి కూడా పని చేస్తున్నారు. ప్రముఖ కళా దర్శకుడు సాబు సిరిల్‌ ఆధ్వర్యంలో సెట్స్ వేసారు.

English summary
Baahubali, this movie will re-write the Telugu Film Industry for sure for the huge subject and heavy budget. Prabhas, Anushka, Rana are doing the lead roles while Adivi Sesh, Sudeep are also doing some special roles. It is now heard that Ramya Krishna will be portraying the role of Raja Matha and will be seen as the mother of Prabhas and Rana. This news is to be finalized by Rajamouli and currently the second schedule started yesterday and some scenes were shot on Prabhas and Rana.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu