»   » రాణా, పూరీ జగన్నాధ్ చిత్రం టైటిల్ ఇదే...

రాణా, పూరీ జగన్నాధ్ చిత్రం టైటిల్ ఇదే...

Posted By:
Subscribe to Filmibeat Telugu

రాణా, పూరీ జగన్నాధ్ కాంబినేషన్ లో రూపొందనున్న చిత్రానికి నేను..నా రాక్షసి అనే టైటిల్ ని కన్ఫర్మ్ చేసినట్లు సమాచారం. ఇలియానా హీరోయిన్ గా చేస్తున్న ఈ చిత్రంలో ఈ రోజు(మంగళవారం)నుంచి హైదరాబాద్ లో షూటింగ్ మొదలైంది. నల్లమలుపు బుజ్జి నిర్మిస్తున్న ఈ చిత్రంలో రాణా ఓ డిఫెరెంట్ క్యారెక్టర్ లో కనిపించనున్నాడు. అది ప్రొపెషనల్ కిల్లర్ అని వినపడుతోంది. ఇక ఈ చిత్రం ఓ లవ్ స్టోరి గా వెళుతూ ఓ డిఫెరెంట్ ట్విస్ట్ తో నిండి ఉంటుందని చెప్తున్నారు. ఇక ఈ చిత్రంలో రాణా తన కండలు ప్రదర్శించనున్నారు. ఓ డీసెంట్ లవ్ స్టోరీగా..ఓ కొత్త ఫీల్ తో చిత్రం ఉంటుందని, లీడర్ తర్వాత చేస్తున్న ఈ చిత్రం మంచి విజయం సాధిస్తుందని దర్శక,నిర్మాతలు ధీమాగా ఉన్నారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu