»   » హాట్ టాపిక్ :‘హిరణ్యకశ్యప’ పాత్రకు ఈ స్టార్ హీరోలిద్దరే గుణ శేఖర్ ఆప్షన్?

హాట్ టాపిక్ :‘హిరణ్యకశ్యప’ పాత్రకు ఈ స్టార్ హీరోలిద్దరే గుణ శేఖర్ ఆప్షన్?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: కొడుకు విష్ణుభక్తితత్పరతను మానిపించలేక విసిగిపోయిన హిరణ్యకశిపుడు ఆవేశంతో 'నీ దేవుడు ఎక్కడున్నాడురా?' అని అడగ్గా, అందుకు ప్రహ్లాదుడు,

ఇందుగలడందులేడని
సందేహము వలదు చక్రి సర్వోపగతుం
డెందెందు వెదకి చూచిన
నందందే కలడు దానవాగ్రణి వింటే

అని బదులు చెప్పగా, 'అయితే, నీ దేవుడు ఈ స్తంభంలో ఉన్నాడా?' అని ఆ స్తంభాన్ని ఒక్క తన్ను తన్నాడు. అప్పుడా స్తంభం విచ్చిపోగా, అందులో నుంచి ఉగ్రనరసింహమూర్తి బయల్వెడలి హిరణ్యకశిప సంహారాన్ని చేస్తాడు ఈ సన్నివేశాన్ని మర్చిపోవటం కష్టం. ఇప్పుడీ సీన్ ని తిరిగి సృష్టిస్తానంటున్నారు దర్శకుడు గుణశేఖర్.

'రుద్రమదేవి' తరవాత గుణశేఖర్‌ మెగాఫోన్‌ పట్టి డైరక్ట్ చేయలేదు. దాదాపు 2015లో ఖాళీగా ఉన్నారు. ఆ మధ్యన 'రుద్రమదేవి'కి కంటిన్యూగా 'ప్రతాపరుద్రుడు' అనే కథ సిద్దం చేస్తున్నారని, ఓ స్టార్ హీరో ఇందులో నటిస్తారని ప్రచారం సాగింది.

అయితే.. అందుకు సంబంధించి ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. ఆ స్టార్ హీరోలు ఎవరూ డేట్స్ ఖాళీ లేవని చెప్పి తప్పించుకోవటంతో ఆయన మరో ప్రాజెక్టుపై దృష్టి పెట్టారు. ఇప్పుడు గుణశేఖర్ దృష్టి 'భక్త ప్రహ్లాద' రీమేక్‌పై పడింది. భక్త ప్రహ్లాదలో హిరణ్యకశ్యప పాత్ర గుణని బాగా ఆకట్టుకొందట.

ఆ పాత్రని హైలెట్‌ చేస్తూ 'హిరణ్యకశ్యప' అనే కథని సిద్దం చేశారు. 'ద స్టోరీ ఆఫ్‌ భక్త ప్రహ్లాద' అనేది ఉపశీర్షిక. ఫిల్మ్‌ఛాంబర్‌లో ఈ పేరుని రిజిస్టర్‌ కూడా చేయించారు. హిరణ్య కశ్యప పాత్రలో ఓ స్టార్ హీరో కనిపిస్తాడని ప్రచారం జరుగుతోంది.

వీళ్దిద్దరూ...

వీళ్దిద్దరూ...

అయితే గుణశేఖర్ దృష్టిలో ...ఆ స్టార్ హీరో మరెవరో కాదు దగ్గుపాటి రానా, ఎన్టీఆర్ కాని చేసే అవకాసం అంటున్నారు. ఎన్టీఆర్ తో కూడా గుణశేఖర్ కు మంచి రాపో ఉంది. గతంలో ఎన్టీఆర్ తొలి రోజుల్లో గుణశేఖర్ డైరక్ట్ చేసారు. అప్పుడూ పౌరాణిక పాత్రే. ఇక రానా..భళ్లారిదేవ గా మంచి పేరు తెచ్చుకున్నారు.

పౌరాణికం కేక పెట్టిస్తారు

పౌరాణికం కేక పెట్టిస్తారు

ఎన్టీఆర్ అయితే పౌరాణిక పాత్రను దుమ్ము రేపుతారనటంలో సందేహం లేదు. ఇంతకు ముందు రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన యమదొంగ చిత్రంలోనూ యంగ్ యముడుగా పౌరాణిక గెటప్ లో ఎన్టీఆర్ అదరకొట్టాడు. ఎన్టీఆర్ చేస్తే బాగుంటుందని అభిమానులు భావిస్తున్నారు.

అప్పుడు వేరే దారి ఉండదు

అప్పుడు వేరే దారి ఉండదు

అయితే ఎన్టీఆర్ ఆల్రెడీ ఓ ప్రాజెక్టు ఓకే చేసారు. కాబట్టి ఆ పాత్ర రానా తో చేసే అవకాసం ఉందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. ఎన్టీఆర్ కాదంటే....రానాతో ముందుకు వెళ్లాలని, గుణశేఖర్‌ దృష్టి కూడా రానాపైనే ఉందని సమాచారం.

లుక్ సరిపోతాడు

లుక్ సరిపోతాడు

రానా..గతంలో గుణశేఖర్ డైరక్షన్ లో వచ్చిన రుద్రమదేవిలో రానా ఓ కీలక పాత్రలో కనిపించాడు. పైగా నెగిటీవ్‌ పాత్రలంటే రానాకి చాలా ఇష్టం. అందుకే ఈ సినిమాపై రానా సైన్ చేయడం ఖాయమని ఫిల్మ్‌నగర్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మరి రానా ఏమంటాడో ?

పోలిక వస్తుంది

పోలిక వస్తుంది

అయితే గుణశేఖర్ ఆలోచన బాగానే ఉంది కానీ ఎస్వీ రంగారావు వంటి మహానటుడు నటించిన ఆ పాత్రను ఈ కాలంలో పోషించే నటుడు ఎవరు అనేది ఆసక్తికరమే. ఎందుకంటే ఎంత బాగా చేసినా పోలిక వస్తుంది. అంత బాగా చేసే వారు కావాలి. దానికి తోడు..ఓ బిడ్డకు తండ్రిగా కనిపించాలి.

భాగవతం చదువుతూంటే..

భాగవతం చదువుతూంటే..

''నాకు భక్త ప్రహ్లాద కథంటే చాలా ఇష్టం. అందులో హిరణ్యకశ్యపుడి పాత్ర నన్ను ఎప్పట్నుంచో వెంటాడుతోంది. భాగవతం చదువుతున్నప్పుడు ఆ పాత్రకి సంబంధించి పలు కీలకమైన విషయాలు తెలిశాయి.

విలన్స్ గా..

విలన్స్ గా..

హిరణ్యకశ్యప పాత్ర కోణంలో భక్తప్రహ్లాద కథని చెప్పే ప్రయత్నమిది. ఇటీవల హీరోలు ప్రతినాయకులుగా నటించేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఈ సినిమాలోనూ హిరణ్యకశ్యప పాత్రలో ఓ స్టార్ హీరో నటిస్తారు.ఆ నేపథ్యంలోనే ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నా

ఓ పెద్ద ప్రొడక్షన్ హౌస్ తో ..

ఓ పెద్ద ప్రొడక్షన్ హౌస్ తో ..

ఆ స్టార్ హీరో ఎవరనేది వచ్చే నెలలో ప్రకటిస్తాం. అత్యున్నత సాంకేతిక హంగులతో ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నాం. ఒక ప్రఖ్యాత నిర్మాణ సంస్థతో కలిసి స్వయంగా చిత్రాన్ని నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నాము''అన్నారు.

అప్పుడు పట్టాలెక్కిస్తా..

అప్పుడు పట్టాలెక్కిస్తా..

'రుద్రమదేవి' ప్రేక్షకుల ముందుకొచ్చాక గుణశేఖర్‌ 'ప్రతాపరుద్రుడు' తెరకెక్కించబోతున్నారని ప్రచారం సాగింది. ఆ విషయంపై గుణశేఖర్ స్పందిస్తూ ''2018లో 'ప్రతాపరుద్రుడు' చిత్రాన్ని పట్టాలెక్కిస్తాను''అని స్పష్టం చేశారు. అవునూ ఇంతకీ ఆ ప్రతాప రుద్రుడులో హీరో ఎవరంటారు.. రానా తో చేస్తారా లేక అల్లు అర్జున్ ని ఒప్పించారా...ఎవరు చేయబోతున్నారో చూడాలి.

మల్లి లాంగ్వేజ్

మల్లి లాంగ్వేజ్

గుణశేఖర్ తన 'గుణ టీమ్ వర్క్స్' బేనర్ మీద 'హిరణ్య కశ్యప' అనే టైటిల్ రిజిస్టర్ చేయించడంతో అంతటా హాట్ టాపిక్ గా మారింది. మరో ప్రక్క ఓ తమిళ నటుడిగా హీరోగా పెట్టి మల్టీ లాంగ్వేజ్ ఫిల్మ్ తీయాలని గుణశేఖర్ ప్రయత్నిస్తున్నట్లు చెప్పుకుంటున్నారు.

కోణంలో సాగుతోంది

కోణంలో సాగుతోంది

వాస్తవానికి హిరణ్య కశ్యపుడు అనగానే ఆటోమేటిగ్గా 'భక్త ప్రహ్లాద' సినిమా గుర్తుకొస్తుంది. అందులో ఎస్వీఆర్ పోషించింది హిరణ్య కశ్యపుడి పాత్రే. మరి క్లాసిక్‌గా నిలిచిపోయిన 'భక్తప్రహ్లాద'కు కొత్త వెర్షన్ తీయడానికి గుణశేఖర్ సన్నాహాలు చేస్తున్నాడని అంటున్నారు. ఈ సినిమా హిరణ్య కశ్యపుడి కోణంలోనే సాగుతుందని తెలుస్తోంది.

హాలీవుడ్ ట్రెండ్ ని అనుకరిస్తూ..

హాలీవుడ్ ట్రెండ్ ని అనుకరిస్తూ..

హాలీవుడ్ లో పాత క్లాసిక్స్ ని మరోసారి రీమేక్ చేస్తున్న ట్రెండ్ నడుస్తోంది. దాంతో తెలుగులో కూడా అలాంటి ప్రయత్నమే చేయాలని గుణశేఖర్ భావిస్తున్నారట. మరి ఆయన ప్రారంభించే ఈ ట్రెండ్ ని మరింత మంది ప్రయత్నిస్తారో చూడాలి.

English summary
Now, Director Guna Shekar is currently busy with his next project titled Hiranyakashyapa which will start rolling next year. Yes, Gunashekar is in plans to rope in either NTR or Rana for the lead role in Hiranyakashyapa.
Please Wait while comments are loading...