Just In
- 13 min ago
ఊపిరి పీల్చుకో బాక్సాఫీస్.. మరో కొన్ని నెలల్లో కిక్కిచ్చే సినిమాలతో రాబోతున్న స్టార్ హీరోలు
- 1 hr ago
క్యారెక్టర్ ఆర్టిస్ట్ ప్రగతి మరో షాకింగ్ లుక్.. 16ఏళ్ల కూతురు, ఎక్స్‌పోజింగ్‌తో చంపేసిందిగా..
- 2 hrs ago
RRR పోస్టర్.. ఆ సినిమా నుంచి తస్కరించారట.. రాజమౌళిపై మరోసారి ట్రోలింగ్స్
- 10 hrs ago
ఎస్సీ బాలసుబ్రహ్మణ్యంకు పద్మ విభూషణ్.. గానగంధర్వుడికి ఘన నివాళి
Don't Miss!
- News
వెర్టికల్ ఛార్లీ స్పెషల్ అట్రాక్షన్: విన్యాసాల కోసం ఎదురు చూపులు: కాస్సేపట్లో నింగిలోకి
- Automobiles
బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ కోసం 50,000 మంది క్యూలో ఉన్నారు..
- Sports
ISL 2020 21: చెన్నయిన్ X ముంబై మ్యాచ్ డ్రా
- Lifestyle
మంగళవారం దినఫలాలు : వ్యాపారులకు ఈరోజు చాలా అదృష్టం కలిసి వస్తుంది...!
- Finance
రూ.50వేలకు దిగువనే బంగారం ధరలు, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
కరుణ్ జోహార్ తో తెలుగు హీరో ఖరారు
బాలీవుడ్ స్టార్ డైరక్టర్ కరుణ్ జోహార్ నిర్మించే చిత్రంలో తెలుగు హీరో దగ్గుపాటి రాణా ప్రత్యేక పాత్ర చేస్తున్నాడని సమాచారం. యెహ్ జవానీ హై దీవానీ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని వేక్ అప్ సిడ్ దర్శకుడు ఆర్యన్ ముఖర్జీ డైరక్ట్ చేస్తున్నారు. రణబీర్ కపూర్,దీపిక పదుకోని లీడ్ రోల్స్ చేస్తున్న ఈ చిత్రం ఓ రొమాంటిక్,ప్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతోంది. బాలీవుడ్ లో రానా ఇప్పటికి దమ్ మారో దమ్,డిపార్టమెంట్ చిత్రాలు చేసి ఉన్నాడు.
ఇక తాజాగా వర్మ దర్శకత్వంలో చేసిన డిపార్టమెంట్ చిత్రం విడుదలైంది. అయితే అది భారీ డిజాస్టర్ చిత్రంగా టాక్ తెచ్చుకుంది. దాంతో డిపార్టమెంట్ విషయంలో మాత్రం రానా చాలా ఉదాశీనంగా ఉన్నాడు. ఈ చిత్రంపై తన అంచనాలు గురించి చెపుతూ..సినిమా హిట్ ప్లాప్ లను ముందుగానే చెప్పగలిగేవాళ్లు ఇక్కడ ఎవరూ లేరు. వర్మలాంటి దర్శకులతో పని చేస్తే చాలు... నటుడిగా ఎన్నో విషయాలు తెలుసుకోవచ్చు. అంతకుమించి నేనేమీ ఆశించలేదు అన్నారు.
అలాగే రామ్ గోపాల్ వర్మ ది ఇరవయ్యేళ్ల అనుభవం. గుర్తుండిపోయే సినిమాలెన్నో తీశారు. ఆయనతో కలిసి పని చేయడం నాకు దక్కిన ఒక గొప్ప అవకాశం అన్నారు. అయినా అమితాబ్, సంజయ్‌దత్, రామ్‌గోపాల్‌వర్మ లాంటి అనుభవజ్ఞులతో కలిసి పని చేయడం గొప్ప మలుపుగా భావిస్తాను. ఇంకా ఆ సినిమా ఫలితం గురించి నేను ఆలోచించాలా? అని తేల్చి చెప్పారు.
మరో ప్రక్క రానా తెలుగులో క్రిష్ దర్శకత్వంలో 'కృష్ణం వందే జగద్గురుమ్' చిత్రం చేస్తున్నారు. సాయిబాబు జాగర్లమూడి, వై.రాజీవ్ రెడ్డిలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో రాణా బిటెక్ బాబుగా కనిపించనున్నాడు. ఆ పాత్ర డిఫెరెంట్ గా ఉంటుందంటున్నారు దర్శకుడు క్రిష్. అలాగే మహేష్ బాబు కెరీర్ లో సూపర్ హిట్ చిత్రం ఒక్కడు ని రానా తో రీమేక్ చేయటానికి వర్మ ప్రయత్నం చేస్తున్నారు. ఎమ్.ఎస్ రాజు నిర్మాతగా గుణ శేఖర్ డైరక్ట్ చేసిన ఈ చిత్రం త్వరలో బాలీవుడ్ లో రీమేక్ కానుంది. రామ్ గోపాల్ వర్మ స్వయంగా ఈ చిత్రాన్ని హిందీలో డైరక్ట్ చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు.