Rashmika Mandanna: రష్మిక మందన్నా ఫేస్ సర్జరీ? అసలేమైందంటే..
స్టార్ హీరోయిన్ రష్మిక మందన్నా (Rashmika Mandanna) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తన అందం, అభినయంతో కోట్లాది అభిమానుల హృదయాలను గెలుచుకుంది. 'గీత గోవిందం', 'డియర్ కామ్రేడ్', 'పుష్ప' వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకుల మనసులో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న రష్మిక, పుష్ప 2 సక్సెస్ తో ఇప్పుడు దేశవ్యాప్తంగా నేషనల్ క్రష్‌గా మారిపోయింది. ఇటీవల తన వ్యక్తిగత విషయాలతో తరుచుగా వార్తల్లో నిలుస్తున్న అమ్మడు తాజాగా మరోసారి హాట్ టాపిక్ గా మారారు. ఇంతకీ ఏం జరిగిందంటే?
సినీ ఇండస్ట్రీ అంటే గ్లామర్ వర్డల్. ఇక్కడ అందం, ఆకర్షణ, ప్రెజెంటేషన్ అన్నీ కలిసే ఒక స్టార్ ఇమేజ్ క్రియేట్ అవుతుంది. ఇక హీరోయిన్‌లకు అయితే.. బ్యూటీ మరింత ముఖ్యమైన అంశం. అందుకే చాలామంది నటీమణులు తమ లుక్‌ను మెయింటైన్ చేసుకునేందుకు వ్యాయామం, యోగా, కఠినమైన డైట్‌లు, స్కిన్ కేర్ రొటీన్‌లు, బ్యూటీ ట్రీట్‌మెంట్లు చేసుకుంటూ ఉంటారు. తాజాగా ఈ జాబితాలో నేషనల్ క్రష్ రష్మిక మందన్నా కూడా చేరిపోయిందట. అసలేం జరిగిందంటే..

తాజాగా రష్మిక మందన్నా ఒక ఎయిర్‌పోర్ట్‌లో దర్శనమిచ్చింది. బ్లాక్ డ్రెస్‌లో, బ్లాక్ మాస్క్ ధరించి సింపుల్‌గా కనిపించిన ఆమెను ఫోటోగ్రాఫర్లు, అభిమానులు చుట్టుముట్టారు. ఎప్పటిలాగే ఫోటోల కోసం "మాస్క్ తీయండి మేడమ్, ఒక ఫోటో ప్లీజ్!" అని కోరారు. కానీ ఈసారి రష్మిక మాత్రం మాస్క్ తీసే ప్రయత్నం చేయలేదు. రష్మిక నవ్వుతూ "ఫేస్ ట్రీట్‌మెంట్ అయ్యింది గైస్, తీయలేను" అని చెప్పింది.
ఆ ఒక్క మాట సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. "రష్మిక ముఖానికి ఏమైంది?", "ఏ ట్రీట్‌మెంట్ చేయించుకుందో?", "లిప్ ఫిల్లర్ వేయించుకుందేమో?" అంటూ నెటిజన్లు ఊహాగానాలు మొదలుపెట్టారు. కొన్ని ఫోటోలు, వీడియోల్లో ఆమె లుక్‌లో కొద్దిగా మార్పులు కనిపిస్తున్నాయని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. రష్మిక తాజా లుక్స్‌ని పరిశీలించిన నెటిజన్లు ముఖ్యంగా ఆమె లిప్స్ దగ్గర చిన్న మార్పులు కనిపిస్తున్నాయని అంటున్నారు. "లిప్ ఫిల్లర్స్ వేసుకుందేమో?" అని కొందరు కామెంట్ చేస్తుంటే.. మరికొందరు "స్కిన్ గ్లో ట్రీట్‌మెంట్ చేసుకుందేమో?" అని కామెంట్లు చేస్తున్నారు.
మరి కొంతమంది అభిమానులు "రష్మిక సహజంగా చాలా అందంగా ఉంటుంది, ఇలాంటి ట్రీట్‌మెంట్‌లు అవసరమే లేదు", "నేచురల్ లుక్‌నే ఆమె స్పెషల్!"అని కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరు మాత్రం "ఇటీవల రష్మిక, విజయ్ దేవరకొండ లవ్ రూమర్స్ ఎక్కువవుతున్నాయి, బహుశా పెళ్లికి ముందు కొత్త లుక్ కోసం ఇలా చేసుకుందేమో?" అంటూ ఊహాగానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇలా చిన్న స్టేట్మెంట్ తో మరోసారి వార్తల్లో నిలిచింది రష్మిక .
ఇదిలా ఉండగా, రష్మిక మందన్నా కెరీర్ ప్రస్తుతం టాప్ గేర్‌లో దూసుకెళ్తోంది. ఈ ఏడాది వరుసగా హిట్స్ అందుకున్న రష్మిక "కుబేర", "థామా", "ఛావా" వంటి చిత్రాలతో బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించింది. ఇప్పుడు మరోసారి ప్రేక్షకుల హృదయాలను గెలుచుకునేందుకు సిద్ధమవుతోంది. త్వరలో విడుదలకానున్న "ది గర్ల్‌ఫ్రెండ్" సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్న రష్మిక, ఈ సినిమాకి సంబంధించి ప్రమోషన్లలో బిజీగా ఉంది. నవంబర్ 7న థియేటర్లలోకి రానున్న ఈ రొమాంటిక్ డ్రామాలో రష్మిక పాత్రే ప్రధాన ఆకర్షణగా నిలవనుందని చిత్రబృందం చెబుతోంది.


Click it and Unblock the Notifications











