For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ట్విస్ట్: నితిన్ తో కాదు కళ్యాణ్ రామ్ తో మొదలవుతోంది

  By Srikanya
  |

  హైదరాబాద్ : పిల్లా నువ్వు లేని జీవితం అంటూ హిట్ కొట్టిన రవి కుమార్ చౌదరి తదుపరి చిత్రం నితిన్ తో మొదలవుతోందంటూ వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా అందిన సమాచారం ప్రకారం కళ్యాణ్ రామ్ హీరోగా రవికుమార్ చౌదరి దర్శకత్వంలో చిత్రం మొదలు కానుంది. ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మిస్తున్నారు. పూర్తి స్దాయి యాక్షన్ ఎంటర్టైనర్ గా చిత్రం రూపొందనుందని తెలుస్తోంది. ఈ మేరకు కథని ఒప్పించి ప్రస్తుతం పూర్తి స్దాయి స్క్రిప్టుని లాక్ చేసే పనిలో ఉన్నట్లు టాలీవుడ్ సమాచారం.

  ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

  కళ్యాణ్ రామ్ సైతం రీసెంట్ గా పటాస్ తో హిట్ కొట్టి ఉన్నారు. పటాస్ ని దిల్ రాజు అవుట్ రేట్ కు కొని లాభం పొందారు. ఈ నేపధ్యంలో కళ్యాణ్ రామ్ తో ఆయన సినిమా చేయటానికి ముందుకు వచ్చారు. అలాగే పిల్లా నువ్వు లేని జీవితం చిత్రానికి సైతం దిల్ రాజు ఒక నిర్మాత గా వ్యవహరించిన సంగతి తెలిసిందే. దాంతో వీరిద్దరితోనూ ఆయన చేయటానికి ఉత్సాహం చూపిస్తున్నారు.

  కళ్యాణ్ రామ్ తన తదుపరి చిత్రాలు గురించి మాట్లాడుతూ... ప్రస్తుతం ‘కిక్‌-2' షూటింగ్‌ జరుగుతోంది. ‘షేర్‌' సినిమా కొంత టాకీ, 5 పాటలు చిత్రీకరించాల్సి ఉంది. బాబాయ్‌, తమ్ముడు ఎన్టీఆర్‌, నేను కలిసి ఓ సినిమా చేస్తాం. దానికి సంబంధించిన గ్రౌండ్‌ వర్క్‌ జరుగుతోంది. ఆ పనులు పూర్తయ్యాక వివరాలు వెల్లడిస్తా అన్నారు. బాలకృష్ణ బాబాయ్ కూడా సినిమా చూసి, సంతోషించారు. తమ్ముడు తారక్ (చిన్న ఎన్టీయార్) 'అన్నా! నీ కెరీర్‌లో అత్యుత్తమ అభినయం!' అంటూ మెచ్చుకున్నాడు అన్నారు.

  Ravi Kumar Chowdary to Direct Kalyan Ram

  అన్ని కుటుంబాలలో లాగానే మాకూ చిన్న చిన్న అలకలు, కోపతాపాలు ఉంటాయి. అయితే, అవేవీ శాశ్వతం కాదు. అన్నీ వచ్చిపోతుంటాయి. మేమంతా ఎప్పుడూ ఒక్కటే! ఎప్పటికైనా 'మనం' లాగా మా కుటుంబంలో మా నాన్న, బాబాయ్, నేను, తమ్ముడు తారక్ - ఇలా మూడు తరాల వాళ్ళం కలసి సినిమా చేయాలని నా కోరిక. అలాంటి అవకాశం, అదృష్టం మన తెలుగు పరిశ్రమకే ఉండడం విశేషం.

  అలాగే... కలసి ఉంటే కలదు సుఖం.. అనే మాట నమ్ముతా. అందరూ కలసి ఓ కుటుంబంగా ఉండడంలో ఆ బలమే వేరు. అన్నయ్య జానకీరామ్‌ లేకపోవడంతో మా కుటుంబం పెద్ద అండ కోల్పోయింది. మేం చాలా అన్యోన్యంగా ఉండేవాళ్లం. నాన్న తరవాత నాన్న అన్నంత ప్రేమ నాకు. ఎందుకంటే నాన్న సినిమాలతో బిజీగా ఉన్నప్పుడు నా వ్యవహారాలన్నీ అన్నయ్యే చూసుకొనేవారు.

  ప్రతి విషయాన్నీ అన్నయ్యతో కలసి పంచుకొనేవాణ్ని. అన్నయ్యకు పటాస్‌ హిట్టవుతుందని బలమైన నమ్మకం ఉండేది. ఫస్ట్‌లుక్‌ బయటకు వచ్చిన రోజు 'నాన్నా! ఈ సినిమా బాగుంటుంది. 'పటాస్‌' తరవాత నీకంతా మంచే జరుగుతుంది' అన్నారు. అన్నయ్య లేకపోవడం పెద్ద లోటు. ఈ సమయంలో బాబాయ్‌, తమ్ముడు అందించిన సహకారం, ఇచ్చిన స్త్థెర్యం మర్చిపోలేను అని చెప్పుకొచ్చారు.

  ఇక కష్టాల్లో ఉన్నప్పుడు నా కుటుంబం, స్నేహితులే నాకు దైర్యానిచ్చారు. ఎంత కష్టమొచ్చినా ఇండస్ట్రీ వదిలి వెళ్ళాలనుకోలేదు. తాతగారు మాకు చూపించిన దారి ఇది. ఈ వృత్తితోనే మేం నాలుగు మెతుకులు తినగలుగుతున్నాం. దీనిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. నేను సినిమాల్లో యాక్ట్‌ చేస్తూనే నా ప్రొడక్షన్‌ హౌస్‌ను కూడా అభివృద్ధి చేస్తున్నాను.

  'పటాస్‌' విషయానికి వస్తే...

  కళ్యాణ్ రామ్ హీరోగా రూపొందిన 'పటాస్‌' చిత్రం విడుదలై విజయవంతంగా నడుస్తున్న సంగతి తెలిసిందే . రచయితగా పలు చిత్రాలకి పనిచేసిన అనీల్ రావిపూడి ఈ చిత్రం ద్వారా దర్శకుడుగా పరిచయమయ్యారు. ఈ చిత్రం మార్నింగ్ షో కే హిట్ టాక్ తెచ్చుకుంది. ఈ నేపధ్యంలో చిత్రం శాటిలైట్ రైట్స్ ని పోటీపడి జీ తెలుగు ఛానెల్ సొంతం చేసుకున్నట్లు సమాచారం. 4.30 కోట్లకు ఈ రైట్స్ అమ్ముడు పోయినట్లు టీవీ వర్గాల్లో వినపడుతోంది. కళ్యాణ్ రామ్ సినిమాను టీవి కు కొందమా వద్దా అనే స్ధాయి నుంచి ఈ చిత్రం ఒక్కసారిగా...పోటీ పడి భారీ రేటుకు అమ్ముడయ్యే స్దితికి తెచ్చింది.

  English summary
  A.S.Ravikumar Chowdary, who recently tasted a success after a long time with ‘Pilla Nuvvu Leni Jeevitham’, will direct Kalyan Ram and the film will be produced by Dil Raju.Recently there was a news that A.S.Ravikumar Chowdary will direct Nithiin.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X