»   » బాలయ్య మీద రివేంజ్ తీసుకోవడానికి రవితేజ ప్లాన్...?

బాలయ్య మీద రివేంజ్ తీసుకోవడానికి రవితేజ ప్లాన్...?

Posted By:
Subscribe to Filmibeat Telugu

బాలకృష్ణ 'మహారథి" చిత్రంలో మీరా జాస్మిన్ నటిస్తుందని తెలిసేసరికి రవితేజ కామెడీ చేశాడని, అతని గురించి ఏదో కామెంట్ చేస్తే ఆమె సరాసరి వెళ్లి బాలయ్యకి మేటర్ చెప్పిందని, దాంతో బాలయ్య కోపంతో ఊగిపోయి రవితేజ చెప్పచెల్లు మనిపించాడని చిత్ర సీమలో ఒక రూమరుంది. అది నిజం కాదంటూ రవితేజ కొట్టిపారేసినా కానీ నిజమే అయివుంటుందని చాలా మంది నమ్ముతున్నారు. బాలయ్య రవితేజ ని కొట్టడం మాటెలా ఉన్నా కానీ రవితేజ మాత్రం 'ఒక్క మగాడు" సినిమాని 'కృష్ణ"చిత్రంతో చితగ్గొట్టాడు.

సంక్రాంతి హీరో అనే పొగరుతో మరోసారి బాక్సాఫీస్ ని ఏలేద్దామని వచ్చిన బాలయ్యకి ఒక్కమగాడు బలమైన షాకిచ్చింది. బాలయ్యకి మళ్లీ అలాంటి షాకే ఇంకాస్త గట్టిగా ఇవ్వాలని రవితేజ ఉవ్విళ్లూరుతున్నాడు. మిరపకాయ్ సినిమాని జనవరి 6న విడుదల చేయాలని పావులు కదుపుతుంటే దానిని పరమవీరచక్రతో పాటుగా రిలీజయ్యేలా చూడాలని రవితేజ కోరుతున్నాడు. అలా బాలయ్యని మరోసారి ఇంకా గట్టిగా కొట్టి కసి తీర్చుకోవాలని రవితేజ చూస్తున్నాడు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu