»   » కొత్త చిత్రంలో రవితేజ పాత్ర ...టైటిల్ ?

కొత్త చిత్రంలో రవితేజ పాత్ర ...టైటిల్ ?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : బాబీ దర్శకత్వంలో రూపొందబోయే రవితేజ కొత్త చిత్రం ఈ రోజు ప్రారంభమయ్యింది. ఈ చిత్రంలో రవితేజ ..పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నారని సమాచారం. రవితేజ సూపర్ హిట్ విక్రమార్కుడుని పోలిన కథతో ఈ చిత్రం తెరకెక్కుతోందని ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతోంది. డ్యూయిల్ రోల్ పాత్రను మరోసారి పోషిస్తున్నాడని,అయితే పూర్తి స్ధాయి ఎంటర్ట్నైమెంట్ తో ట్రీట్ మెంట్ ఇచ్చారని చెప్పుకుంటున్నారు. ఈ చిత్రానికి జింతాత ..జింతాత అనే టైటిల్ పెట్టే అవకాసముందని సమాచారం.

బాబీ ఈ చిత్రంతో దర్శకుడుగా నిలదొక్కుకుండని ఆశిస్తున్నారు. రవితేజ హీరోగా మరో సినిమా మొదలైంది. హన్సిక హీరోయిన్. రాక్ లైన్ ఎంటర్టెన్మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై రాక్‌లైన్ వెంకటేష్ నిర్మిస్తున్న ఈచిత్రానికి కె.ఎస్.రవీంద్రనాథ్ (బాబీ) దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్ర ప్రారంభోత్సవ కార్యక్రమం బుధవారం హైదరాబాద్‌లో జరిగింది. ఈ చిత్రంలో రవితేజ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపిస్తారని తెలుస్తోంది.

సినిమా గురించి దర్శకుడు మాట్లాడుతూ...'ఇంతకు ముందు బలుపు చిత్రానికి రైటర్‌గా పని చేసాను. ఇపుడు డైరెక్టర్‌గా కూడా అవకాశం ఇచ్చారు రవితేజ. టాలెంటు, కసి ఉన్న వారిని ప్రోత్సహించడంలో ఆయన ముందుంటారు. ఈ సినిమాతో నన్నునేను నిరూపించుకుంటాను. ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తారు' అని తెలిపారు.

నిర్మాత మాట్లాడుతూ...'తెలుగులో నాకు ఇదే తొలి సినిమా. రవితేజ నుంచి నాలుగేళ్ల నుంచి సినిమా చేయాలనుకుంటున్నాను. బాబీ మంచికథ చెప్పారు. కన్నడలో 33 సినిమాలు, తమిళంలో 2 సినిమాలు చేసాను. ఈ సినిమాతో తెలుగులోనూ సక్సెస్ అవుతాననే నమ్మకం ఉంది' అన్నారు.

ఈ సినిమాలో బ్రహ్మానందం, పరుచూరి వెంకటేశ్వరరావు, బ్రహ్మాజీ, పోసాని కృష్ణ మురళి, ముఖేష్ రుషి, రావు రమేష్, మిర్చి సంపత్, సుబ్బరాజు, సప్తగిరి, సురేఖావాణి, జోగి బ్రదర్స్ నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం : థమన్, సినిమాటోగ్రఫీ: ఆర్దర్.ఎ.విల్సన్, ఆర్ట్: బ్రహ్మ కడలి, ఎడిటింగ్: గౌతం రాజు, మాటలు: కోన వెంకట్, స్క్రీన్ ప్లే: కె.చక్రవర్తి, మోహన్ కృష్ణ, ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్: పి.ఎ.కుమార్ వర్మ, నిర్మాత: రాక్ లైన్ వెంకటేష్, కథ-దర్శకత్వం: కె.ఎస్.రవీంద్రనాథ్(బాబి)

English summary
Ravi Teja impressed with his performance as a police officer in the film ‘Vikramarkudu’. Ravi Teja’s high voltage performance as Vikram Singh Rathod remains popular to this day. This movie was launched today morning and Bobby is the director. Rockline Venkatesh is the producer.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X