Just In
- 8 hrs ago
చార్ కదమ్ అంటూ చిరు రచ్చ.. మెగా ఫ్రేమ్‌లో నలుగురు దర్శకులు!
- 9 hrs ago
అది ఒత్తిడితో కూడుకున్న పని.. వారి వల్లే సాధ్యమైంది.. దూసుకెళ్తోన్న శివజ్యోతి
- 9 hrs ago
నాగ్‌తో అలా చిరుతో ఇలా.. ప్లానింగ్ మామూలుగా లేదు.. మెగా ఇంట్లో సోహెల్ రచ్చ
- 10 hrs ago
నితిన్ ‘చెక్’ అప్డేట్.. థియేటర్లోకి వచ్చేది ఎప్పుడంటే?
Don't Miss!
- Lifestyle
శనివారం దినఫలాలు : వృశ్చిక రాశి వారికి ఈరోజు ఆర్థిక పరంగా అదృష్టం కలిసి వస్తుంది...!
- News
మూడ్ ఆఫ్ ది నేషన్ 2021: రైతుల ఆందోళనను మోడీ సర్కారు బాగా నియంత్రించింది
- Finance
భారీగా పడిపోయిన బంగారం, వెండి ధరలు: వెండి రూ.1,000కి పైగా డౌన్
- Sports
భారత్ చారిత్రక విజయం వెనుక ఆ ముగ్గురిది కీలక పాత్ర: ఇంజమామ్ ఉల్ హక్
- Automobiles
అలెర్ట్.. ఇక రోడ్డుపై అలా వెళ్తే డ్రైవింగ్ లైసెన్స్ రద్దు
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
కన్ఫ్యూజన్ ఎందుకని మాస్ మహారాజ్ డిసీజన్.. చివరకి డిస్కోరాజా!
మాస్ మహారాజ్ రవితేజ హీరోగా వీఐ ఆనంద్ దర్శకత్వంలో 'డిస్కోరాజా' సినిమా రూపుదిద్దుకుంటోంది. ఎస్.ఆర్.టి. ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ చిత్రానికి రామ్ తాళ్లూరి నిర్మాతగా వ్యవహరిస్తుండగా, థమన్ సంగీతం అందిస్తున్నారు. చిత్రంలో రవితేజ సరసన పాయల్ రాజ్‌పుత్, నభా నటేష్, తాన్య హోప్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. రవితేజ అభిమానుల టేస్ట్‌కి సరిపోయేలా ఈ సినిమా తెరకెక్కుతోంది.
స్క్రిప్ట్ ప్రకారం సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో డిస్కోరాజా కథ అంతా సాగుతుంది. ఈ సినిమా పట్ల దర్శకనిర్మాతలతో పాటు రవితేజ ప్రత్యేక శ్రద్ద తీసుకుంటున్నాడు. అయితే ఇందులో సైంటిఫిక్‌కి సంబంధించిన కొన్ని అంశాల్లో స్పష్టత లోపించడం కారణంగా రవితేజ అసంతృప్తిని వ్యక్తం చేశాడట. అంతేకాదు ఆడియన్స్ ఎక్కడా కన్ఫ్యూజన్‌కి గురి కాకూడదనే ఉద్దేశంతో ఆయన కొన్ని మార్పులు, చేర్పులు సూచించాడట.

దీంతో డిస్కోరాజా లోని కొన్ని సన్నివేశాలను రీ షూట్ చేస్తున్నట్టుగా తాజా సమాచారం. గత కొంతకాలంగా సరైన హిట్ పడక సతమతమౌతున్న రవితేజ ఈ సారి ఎలాగైనా బ్లాక్‌బస్టర్ సాధించాలనే కసితో ఉన్నాడు. ఈ మేరకు 'డిస్కోరాజా' పై స్పెషల్ కేర్ తీసుకుంటున్నాడు. ఈ మేరకు అన్ని పనులను చకచకా పూర్తిచేసి జనవరి 24వ తేదీన ఈ సినిమాను విడుదల చేయాలని సన్నాహాలు చేస్తున్నాడు.
బాబీ సింహా, వెన్నెల కిషోర్, సత్య తదితరులు కీలక పాత్రలు పోషించిన ఈ సినిమాపై రవితేజ అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. చూడాలి మరి ఆ అంచనాలను డిస్కో రాజా ఏ మేర అందుకుంటాడా అనేది.