For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  లీకైంది: 'బెంగాళ్ టైగర్' స్టోరీ ఇదే...?

  By Srikanya
  |

  హైదరాబాద్ :రవితేజ హీరోగా నటించిన కమర్షియల్ ఎంటర్టైనర్ ‘బెంగాల్ టైగర్' రేపు(డిసెంబర్ 10న) ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. చిత్రం ట్రైలర్స్ వచ్చిన క్రేజ్ వల్ల ఈ సినిమాకి బిజినెస్ కూడా బాగానే అయ్యింది. ఈ నేపధ్యంలో ఈ చిత్రం కథ అంటూ ఒకటి ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతోంది. ఆ కథను మీముందు ఉంచుతున్నాం....

  అందుతున్న సమాచారం ప్రకారం..రవితేజ ఈ చిత్రంలో ఆత్రేయ గ్రామంలో మాస్టర్‌ కంప్యూటర్స్‌ చేసిన ఆకాష్‌ నారాయణ్‌ గా కనిపిస్తారు. అతన్ని పెళ్లి చూపుల్లో అక్ష రిజెక్ట్ చేస్తుంది. అక్ష అతనితో ...తను పెళ్లి చేసుకోవాంటే ఆ వ్యక్తి ఫేమస్ అయ్యి ఉండాలని చెప్తుంది. దాంతో రవితేజ...మినిస్టర్ (శాయేజి షిండే) ని రాయితో పబ్లిక్ మీటింగ్ లో కొడతాడు. వెంటనే రవితేజను అరెస్టు చేస్తారు. మీడియా అతని వెంట పడి హైలెట్ చేస్తుంది.

  షిండే...అతన్ని జైలులో కలిసి, ఆ రాయి విసరటానికి గల కారణం అడుగుతాడు. అతను చెప్పిన కారణం ..ఫేమస్ అవటానికి అనిదే విని, అతని గట్స్ కి మెచ్చుకుని, అతని ప్రక్కనే పెట్టుకుంటాడు. ఆ సమయంలో హోం మినిస్టర్ కుమార్తె (రాశి ఖన్నా) కు లైఫ్ ధ్రెట్ ఉందని తెలుస్తుంది. దాంతో షిండే అతన్ని హోం మినిస్టర్ కి రికమెండ్ చేస్తాడు. హోం మినిస్టర్ ...విదేశాల నుంచి వస్తున్న తన కూతురుని ఎయిర్ పోర్ట్ నుంచి సేప్టీగా తీసుకురమ్మని పురమాస్తాడు.

  Ravi Teja's Bengal Tiger Storyline Leaked

  రవితేజ..ఎయిర్ పోర్ట్ కు వెళ్తాడు. అక్కడ విలన్ గ్యాంగ్ ఎటాక్ చేస్తుంది. కానీ రవితేజ పెద్ద ఫైట్ చేసి ఆమెను సేఫ్ గా తీసుకువస్తాడు. అయితే ఇక్కడో ట్విస్ట్... ఆ విలన్స్ కు రవితేజ..ఇన్ఫర్మేషన్ ఇచ్చాడని తెలుస్తోంది. దాంతో హోం మినిస్టర్ షాక్ అవుతాడు. కానీ...అప్పుడు రవితేజ తాను భయంతో ఆ వచ్చే వాళ్ల గురించి వెయిట్ చేయటం కన్నా తానే ఇన్ఫర్మేషన్ ఇచ్చానని చెప్తాడు. దాంతో మినిస్టర్ చాలా ఇంప్రెస్ అయ్యి...తన ప్రక్కన పెట్టుకుంటాడు. పనిలో పనిగా రాశి ఖన్నా కూడా రవితేజ తో ప్రేమలో పడిపోతుంది. అంతేకాకుండా ఇలాంటి గట్స్ ఉన్నవాడు...తెలివైనవాడితోనే తను జీవితం పంచుకుంటానని చెప్తుంది.

  హోం మినిస్టర్...తన కూతురుకి, రవితేజకు మ్యారేజ్ ఎనౌన్స్ చేయటానికి పార్టీ ఏరేంజ్ చేస్తాడు. ఆ పార్టీకి ఛీఫ్ మినిస్టర్ వస్తాడు. రవితేజ ఆ మ్యారేజ్ ప్రపోజల్ ని వద్దని, తాను ఆల్రెడీ తమన్నా తో ప్రేమలో ఉన్నానని చెప్తాడు. తమన్నా మరెవరో కాదు..సిఎం కుమార్తె. దాంతో సిఎం బొమన్ ఇరానికు మండుతుంది. రవితేజను ఫలానా టైమ్ లోపల చంపుతానని , ఆ పని చెయ్యలేకపోతే..తన కుమార్తెను ఇచ్చి పెళ్లి చేస్తానని అంటాడు.

  ఫైనల్ గా రవితేజను ఏమీ చెయ్యలేని సీఎం...తన కుమార్తెను మర్చిపోవటానికి డబ్బు ఆఫర్ చేస్తాడు. దాన్ని షూట్ చేసి మీడియాకు ఇస్తాడు రవితేజ. సిఎం కు ఏం చేయాలో అర్దం కాదు..అప్పుడు రవితేజ..అసలు విషయం రివీల్ చేస్తాడు. ఇదంతా తాను తన తండ్రి చావుకు కారణమైన సిఎం మీద పగ తీర్చుకోవటానికే చేసానంటూ ప్లాష్ బ్యాక్ చెప్తాడు. ఆ తర్వాత ఏమైంది..అనేది మిగతా కథ.

  గమనిక: ఇది బెంగాళ్ టైగర్ కథ అని ఫిల్మ్ సర్కిల్స్ లో ప్రచారమవుతోంది. ఇదే నిజమైన కథ ..అవునా కాదా అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.

  English summary
  Raviteja's ‘Bengal Tiger’ is all set for a grand release on December, 10th. Here is the storyline of the film according to our Film Nagar sources.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X