విడుదలకు సిద్దమైన డిస్కో రాజా.. టెన్షన్‌లో చిత్రయూనిట్!
మాస్ మహారాజ్ రవితేజ హీరోగా రాబోతున్న కొత్త సినిమా 'డిస్కో రాజా'. వీఐ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఇటీవలే సెన్సార్ కార్యక్రమాలు పూర్తిచేసుకొని విడుదలకు సిద్ధమైంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన అప్‌డేట్స్ అన్నీ ప్రేక్షకుల్లో ఉన్న అంచనాలను రెట్టింపు చేశాయి. దీంతో ఈ సినిమా విడుదల తేదీ జనవరి 24 కోసం ఆసక్తిగా ఎదురు చూస్తోంది ప్రేక్షకలోకం.
ఎస్‌ఆర్‌టీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ పై రూపొందిన ఈ సినిమా ముగ్గురు అందాలా భామలు నటించారు. రవితేజతో నభా నటేశ్, పాయల్ రాజ్ పుత్, తాన్యా హోప్‌లు రెచ్చిపోయి రొమాన్స్ చేసినట్లు టాక్. సినిమాపై భారీ అంచనాలున్న నేపథ్యంలో పెద్దఎత్తున మూవీ రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తోంది చిత్రయూనిట్.

అయితే ఓ వైపున 'సరిలేరు నీకెవ్వరు' సినిమా, మరో వైపున 'అల వైకుంఠపురములో' సినిమాలు థియేటర్స్‌లో సక్సెస్‌ఫుల్ రన్ కొనసాగిస్తుండటం డిస్కో రాజా సినిమా నిర్మాతల్లో టెన్షన్ పుట్టిస్తోందట. ఈ మేరకు ఆశించిన స్థాయిలో థియేటర్స్ దొరక్కపోవడంతో 'డిస్కోరాజా'ను టెన్షన్ పెడుతున్నట్టుగా టాక్ నడుస్తోంది.
సైంటిఫిక్ థ్రిల్లర్‌గా నిర్మితమై ప్రేక్షకుల ముందుకు రాబోతున్న డిస్కోరాజా సినిమాలో రవితేజ ద్విపాత్రాభినయం చేశారు. రవితేజ కెరీర్ లోనే అత్యధిక బడ్జెట్ తో ఈ సినిమాను రూపొందింది. అభిమానులతో పాటు నిర్మాతలు కూడా ఈ సినిమాపై ఆశలు పెట్టుకున్నారు.


Click it and Unblock the Notifications











