»   »  లీకైంది : రవితేజ 'కిక్‌-2' కథ ఇదే????

లీకైంది : రవితేజ 'కిక్‌-2' కథ ఇదే????

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్‌: రవితేజ హీరోగా గతంలో మంచి 'కిక్‌' ఇచ్చిన సినిమాకు సీక్వెల్‌గా వస్తున్న చిత్రం 'కిక్‌-2'. తాజా చిత్రంలో రవితేజ, రకుల్‌ప్రీత్‌ సింగ్‌, రవికిషన్‌ కీలక పాత్రధారులు. ఈ చిత్రానికి సురేందర్‌రెడ్డి దర్శకత్వం వహిస్తుండగా, ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌ పతాకంపై నందమూరి కల్యాణ్‌రామ్‌ నిర్మిస్తున్నారు. ఆగస్టు 21న 'కిక్‌-2'ను విడుదల చేయనున్నారు. ఈ చిత్రానికి ఎస్‌.ఎస్‌.థమన్‌ స్వరాలు అందించారు. ఈ నేపధ్యంలో చిత్రం కథ ఏమిటనేది అందరిలో ఆసక్తి ఏర్పడింది. ఫిల్మ్ నగర్ లో ఈ చిత్రం కథ లీకైందంటూ ఓ కథనం ప్రచారంలోకి వచ్చింది. అదేమిటో మీరు ఇక్కడ చూదవండి.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు


కథ ఏమిటంటే...


రవితేజ ఈ చిత్రంలో డాక్టర్ రాబిన్ హుడ్ గా పరిచయమవుతాడు. అతను అమెరికాలో నివసిస్తూ అక్కడో హాస్పటిల్ కట్టాలనుకుంటాడు. హాస్పటిల్ నిర్మాణం కోసం ఇండియాలోని తన గ్రామంలో ఉన్న ఆస్దులను అమ్మాలని అనుకుంటాడు. అయితే ఊహించని విధంగా అతను యాక్సిడెంట్ కు గురి అవుతాడు. అక్కడో కొద్ది రోజులు ఉంటాడు. తను యాక్సిడెంట్ కారణం అవటానికి కారణమైన వాళ్లని చిన్న ఫైట్ లో కొడతాడు.


ఈలోగా రవితేజ అక్కడ లోకల్ గా ఉండే రకుల్ ప్రీతీ సింగ్ తో ప్రేమలో పడతాడు. అతను పండిట్ రవితేజ(బ్రహ్మానందం) ఇంట్లో పేయింగ్ గెస్ట్ గా ఉంటూంటాడు. బ్రహ్మీ, రవితేజ ల మధ్య వాళ్లు ఆ ఇంట్లో ఉండటానికి కొన్ని కండీషన్స్ పెట్టుకుంటారు. అయితే హఠాత్తుగా... కొందరు రకుల్ ప్రీతి సింగ్ ని కిడ్నాప్ చేసి, రవితేజను తమ గ్రామం వచ్చి తీసుకువెళ్లమని వార్నింగ్ ఇస్తారు.


మిగతా కథ స్లైడ్ షోలో...


షాకింగ్ విషయం

షాకింగ్ విషయం


రకుల్ ను రక్షించటానికి ఆ గ్రామానికి వెళ్లిన రవితేజ అక్కడ ఓ షాకింగ్ విషయం తెలుస్తుంది. అదేమిటంటే...రకుల్ ప్రీతి సింగ్ ఈ కిడ్నాప్ డ్రామా కావాలని ఆడిందని.ఎందుకు కిడ్నాప్ డ్రామా ఆడింది

ఎందుకు కిడ్నాప్ డ్రామా ఆడింది


అతన్ని ఆ గ్రామానికి రప్పించటానికే ఇదంతా చేసిందని అర్దం చేసుకుంటాడు.మలుపు...విలన్ ఎంట్రీ

మలుపు...విలన్ ఎంట్రీ


అక్కడ నుంచి కథ మలుపు తీసుకుంటుంది. ఆ గ్రామాన్ని విలన్ సోలోమన్ సింగ్ ఠాకూర్( రవికిషన్) రూల్ చేస్తూంటాడు. అతను ఆ గ్రామంలో మైనింగ్ బిజినెస్ చేస్తూంటాడు. ఆ గ్రామంలో వారిని తమ బానిసలు గా అతను ట్రీట్ చేసి ఆ మైన్స్ వ్యాపారంలో వాడుకుంటూంటాడు.తండ్రిని చంపేస్తాడు

తండ్రిని చంపేస్తాడు


ఎవరైనా అతనికి వ్యతిరేకంగా మాట్లాడితే వారిని చంపేస్తూంటాడు. అదే క్రమంలో రవికిషన్ ...రకుల్ ప్రీతి సింగ్ తండ్రిని చంపేస్తాడు. ఆమె తండ్రి అక్కడ ఇదేం అన్యాయమని ప్రశ్నించినందుకు అన్యాయంగా బలైపోతాడు.అందుకే రకుల్ కిడ్నాప్ డ్రామా

అందుకే రకుల్ కిడ్నాప్ డ్రామా


రకుల్ ప్రీతి సింగ్ ఈ అన్యాయాలను అర్దం చేసుకుని అరకట్టడానికి సరైన వ్యక్తి కోసం అన్వేషిస్తూంటే మన హీరో ఆమెకు తగులుతాడు. దాంతో ఆమె అతన్ని అక్కడకి కిడ్నాప్ డ్రామా అడి తీసుకువచ్చింది.నో

నో


ఈ విలేజ్ విలన్ కథ అంతా విన్న రవితేజ..తాను కేవలం ఈ గ్రామానికి వచ్చింది తన ఆస్ధులు అమ్ముకుని వెళ్లటానికే కానీ అక్కడ సమస్యలు పరిష్కరించటానికి కాదని, తాను ఇన్వాల్వ్ కానని అంటాడు.కండీషన్

కండీషన్


అంతేకాకుండా రకుల్ ని కూడా తనతో పాటు అమెరికాకు వచ్చేయమంటాడు. అప్పుడు ఆ ఊరి వాళ్లు ఓ కండీషన్ పెడతారు.అదేమిటంటే...

అదేమిటంటే...


అతను కనుక రకుల్ ని వివాహం చేసుకోవాలంటే ఆ ఊరిలో ఓ నెల రోజులు ఉండాలని. తర్వాత ఆ ఊరి వారితో ఎన్నో డిస్కషన్స్ జరిగిన తర్వాతఅతను ఓ పదిరోజులు ఉండటానికి ఒప్పుకుంటాడు.అక్కడ ఆ గ్రామంలో ఉన్న గుడిలో ఉంటాడు.పొరపాటున

పొరపాటున


అయితే అనుకోకుండా పొరపాటున అక్కడ ఆ గుడిలో ఓ అమ్మాయిని రవితేజ హగ్ చేసుకుంటాడు. ఆమె విలన్ రవికిషన్ చెల్లెలు.ఇంకో ఫైట్

ఇంకో ఫైట్


రవికిషన్ సోదరుడు ఇలా రవితేజ తన చెల్లిని కౌగలించుకోవటం చూసి రవితేజపై గూండాలతో విరుచుకుపడతాడు. అప్పుడు రవితేజ కొట్టిన దెబ్బలకు రవికిషన్ సోదరుడు హాస్పటిల్ పాలవుతాడు.ట్రీట్ మెంట్ ఇచ్చి...

ట్రీట్ మెంట్ ఇచ్చి...


అప్పుడు రవితేజ అతనికి ట్రీట్ మెంట్ ఇస్తానంటాడు. ఆ తదుపరి రవితేజతో అతను రికవరి అయ్యాక అతను రవితేజతో పోరాటానికి దిగుతాడు.ఈ లోగా విలన్ నిర్ణయం

ఈ లోగా విలన్ నిర్ణయం


రవికిషన్..ఆ గ్రామాన్ని పేల్చాయలని అనుకుంటాడు.క్లైమాక్స్

క్లైమాక్స్


ఈ విషయం తెలుసుకున్న రవితేజ కోపంతెచ్చుకుంటాడు. భారీ క్లైమాక్స్ అనంతరం రవితేజ ...ఆ గ్రామస్ధులకు విలన్ ని చంపేయటానికి అప్పచెప్తాడు.కిక్ 3

కిక్ 3


అప్పుడు ఆ గ్రామస్దులు బుద్ది చెప్పాక..కిక్ 3 ఉందని ఎండ్ టైటిల్స్ లో వేస్తూ ముగింపు వస్తుంది. ఇది నిజమో కాదో తెలియాలంటే రిలీజ్ అయ్యే దాకా ఆగాల్సిందే.అంచనాలు

అంచనాలురవితేజ, సురేందర్‌రెడ్డి కాంబినేషన్లో గతంలో వచ్చిన కిక్‌ ఘన విజయం సాధించడంతో కిక్‌-2పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.


బిజినెస్ క్రేజ్

బిజినెస్ క్రేజ్


ఇప్పటికే విడుదల చేసిన 'కిక్‌-2' ట్రైలర్, టీజర్‌ లకు మంచి రెస్పాన్స్ వచ్చింది. బిజినెస్ సైతం ఓ రేంజిలో జరిగినట్లు సమాచారం. నిర్మాత మాట్లాడుతూ...

నిర్మాత మాట్లాడుతూ...


‘‘కిక్‌' సినిమా ఎంతగా వినోదాన్ని పంచిందో అంతకు మించి వినోదాన్ని పంచే చిత్రమిది. రవితేజ ఎనర్టీ లెవల్స్‌కి కరెక్ట్‌గా సరిపడే చిత్రమిది. సురేందర్‌ రెడ్డి డైరెక్షన్‌, రవితేజ నటన, డైలాగులు, రకుల్‌ అందచందాలతోపాటు బ్రహ్మానందం కామెడీ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి. పాటలకు, ట్రైలర్‌లకు చక్కని స్పందన వస్తోంది. చిత్ర విజయం మీద మాకు పూర్తి నమ్మకం ఉంది. ఈ నెల 21న సినిమాను విడుదల చేస్తాం'' అని అన్నారు.ప్రస్తుతం

ప్రస్తుతం


విడుదలకు సిద్ధమౌతున్న దశలో సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను ముమ్మరం చేసే పనిలో ఉన్నారు దర్శకనిర్మాతలు.యాప్ ద్వారా

యాప్ ద్వారా


దానిలో భాగంగా సినిమాకు సంబంధించిన పోస్టర్లు, టీజర్, ట్రైలర్లు అన్నీఓ యాప్ ద్వారా విడుదల చేయాలని ప్లాన్ చేశారు.అదే దాని పని

అదే దాని పని


ఆండ్రాయిడ్ మొబైల్స్‌లో అప్లికేషన్ డౌన్ లోడ్ చేసుకున్నవారికి నిరంతరం ఈ సినిమాకు సంబంధించిన అప్ డేట్స్ అందించడమే ఈ యాప్ పని.... హైదరాబాద్ లో ఓ ఎఫ్ ఎం స్టేషన్ లో ఈ యాప్‌ను లాంచ్ చేయబోతున్నారు.English summary
Raviteja , Rakul Preet Singh starrer “Kick 2” is getting for a grand release on Aug 21st. This movie written by Vakkantham Vamsi and directed by Surender Reddy and Produced by Nandamuri Kalyan Ram on N.T.R. Arts banner. Buzzes are spreading wide in Film Nagar circles as film story line:
Please Wait while comments are loading...