»   » రవితేజ కొత్త చిత్రం టైటిల్ 'మిరపకాయ'

రవితేజ కొత్త చిత్రం టైటిల్ 'మిరపకాయ'

Posted By:
Subscribe to Filmibeat Telugu

రవితేజ కొత్త చిత్రానికి 'మిరపకాయ' అనే టైటిల్ ని కన్ఫర్మ్ చేసినట్లు తెలుస్తోంది. అలాగే ఈ చిత్రం ట్యాగ్ లైన్ గా 'వీడు చాలా హాట్ గురూ' అని పెడ్తున్నారు. ఇక ఈ చిత్రాన్ని హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందించనున్నారు. మే లో ఈ చిత్రం ప్రారంభం కానుంది. హరీష్ శంకర్ గతంలో రవితేజ, జ్యోతిక కాంబినేషన్ లో 'షాక్' చిత్రం రూపొందించారు. ఇక ఈ కొత్త చిత్రాన్ని ఆర్.ఆర్.మూవీ మేకర్స్ సమర్పణలో ఎల్లో ఫ్లవర్స్ బ్యానర్ పై రమేష్ పుప్పాల నిర్మించనున్నారు. ప్రస్తుతం రవితేజ గోపీచంద్ మలినేని అనే నూతన దర్శకుడు డైరక్షన్ లో 'డాన్ శీను' చిత్రం చేస్తున్నాడు. త్రిష హీరోయిన్ గా చేస్తున్న ఈ చిత్రాన్ని ఆర్.ఆర్.మూవీ మేకర్స్ పతాకంపై వెంకట్ నిర్మిస్తున్నారు. ఇంతకు ముందు రవితేజ హిట్ కిక్ కూడా ఇదే బ్యానర్ పై వచ్చింది.అలాగే ఈ చిత్రంతో పాటు టాలీ 2 హాలీ సంస్థ 'వీర' అనే చిత్రాన్ని అనౌన్స్ చేసింది. 'రైడ్' డైరక్టర్ రమేష్ వర్మ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu