»   » అటు తిరిగి ,ఇటు తిరిగి గ్రేట్ అంటూ, రవితేజను అంధుడుని చేసేసారు

అటు తిరిగి ,ఇటు తిరిగి గ్రేట్ అంటూ, రవితేజను అంధుడుని చేసేసారు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ఒక హీరోతో అనుకున్న కథ వేరే హీరోతో చేయటం, ముందుకు వెళ్లటం ఇండస్ట్రీలో అతి సాధారణ విషయం. అలాగే ఎన్టీఆర్ తో అనుకున్న కథతో ..రవితేజతో సినిమా ప్రారంభమవుతోంది. అలాగే ఈ చిత్రానికి టైటిల్ కూడా ఫైనల్ అయ్యింది.

వివరాల్లోకి వెళ్తే....తాజాగా రవితేజ... దర్శకుడు అనీల్‌ రావిపూడితో ఓ సినిమా చేయడానికి అంగీకరించాడు. ఇంతకుముందు విభేదాలు వచ్చిన దిల్‌రాజు ఈ సినిమాను నిర్మిస్తుండడం విశేషం. త్వరలోనే ఈ సినిమాను సెట్స్‌ మీదకు తీసుకెళ్తున్నాడు రవితేజ. అనీల్‌ ఇంతకుముందు ఎన్టీయార్‌తో సినిమా చేయాలనుకున్నాడు. అయితే ఎన్టీయార్‌ బాబికి అవకాశమివ్వడంతో అనిల్‌.. అదే కథను రవితేజకు చెప్పాడు. ఈ సినిమాకు 'రాజా.. ది గ్రేట్‌' అనే టైటిల్‌ పరిశీలనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఈ టైటిల్‌ రవితేజకు కరెక్ట్‌గా సరిపోతుందని అనిల్‌, దిల్‌రాజు నమ్మకంతో ఉన్నారట.

 Ravi Teja's new film title Raja The Great

రామ్‌ దగ్గర్నుంచి ఎన్టీఆర్‌... అక్కణ్ణుంచి అటూ ఇటూ తిరిగిన బ్లైండ్‌మ్యాన్‌ స్టోరీ, చివరకు రవితేజ దగ్గరికి చేరిందని చెప్తున్నారు. ఈ కథకు రవితేజ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చేశారని సమాచారం. 'పటాస్‌', 'సుప్రీమ్‌' చిత్రాల ఫేమ్‌ అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందనుండంటతో మంచి క్రేజ్ వస్తుందని భావిస్తున్నారు. ఇందులో రవితేజ అంధుడిగా కనిపించనున్నారని ఫిల్మ్‌నగర్‌ వర్గాల సమాచారం.

''ఆల్మోస్ట్‌ స్క్రిప్ట్‌ వర్క్‌ ఫైనల్‌ వెర్షన్‌ పూర్తయింది. మార్చిలో షూటింగ్‌ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. రవితేజ పాత్ర, సినిమా చాలా కొత్తగా ఉంటుంది'' అని యూనిట్‌ సన్నిహిత వర్గాలు వెల్లడించాయి. ఇందులో రవితేజకి జోడీగా రాశిఖన్నా, 'కృష్ణగాడి వీర ప్రేమగాథ' ఫేమ్‌ మెహరీన్‌ కౌర్‌ నటించనున్నారు.

English summary
Finally Ravi Teja's new film will be going to the sets in the month of March this year. The film will be directed by Anil Ravipudi of 'Pataas' and 'Supreme' fame and Dil Raju will be producing it.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu