»   » సమస్యల్లో రవితేజ-దిల్ రాజు చిత్రం ?

సమస్యల్లో రవితేజ-దిల్ రాజు చిత్రం ?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: మాస్ మహారాజా రవి తేజ హీరో గా, మళయాళ చిత్రం ప్రేమం తో యువకుల మనసులు దోచుకున్న అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా 'ఎవడో ఒకడు' అనే చిత్రం ప్రారంభించిన సంగతి తెలిసిందే.

దిల్ రాజు లాంచ్ చేసిన ఈ సినిమాకు వేణు శ్రీరామ్ డైరక్టర్. అసలు ఇది నంవంబర్ మెదటి వారంలోనే మెదలు కావలసివుంది..కాకపోతే కొన్ని అనివార్య కారణాల వల్ల 2016 ఫిబ్రవరికి వాయిదాపడిందని తెలుస్తోంది.

ఇందులో ఒకటి రెమ్యునరేషన్ కి సంబందించినదైతే, మరోకటి రవితేజ కథ విషయంలో డైరక్టర్ తో కంఫర్ట్ గా లేడనిది వినికిడి, ఇందులోకూడా బెంగాల్ టైగర్ సినిమాలోలా సెకండ్ హాఫ్ వీక్ గా ఉందని అన్నాడని చెప్పుకుంటున్నారు.

Ravi Teja's Yevado Okadu In Trouble?

శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ లో ఈ చిత్రం రాబోతోంది. ఈ చిత్రానికి సంగీతాన్ని రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ అందిస్తారు. ఈ చిత్రం లో రవి తేజ గారిని ఒక కొత్త కోణం లో చూపిస్తాం అని దర్శకులు వేణు శ్రీ రామ్ తెలిపారు. 'ఎవడో ఒకడు' చిత్రం లో యువత ను ఆకట్టుకునే అంశాలు చాలా ఉంటాయని, యువత ఆశయాలకు అద్దం పట్టే కథ అవుతుందని ఆయన అన్నారు.

"రవి తేజ గారి తో భద్ర సినిమా తో సూపర్ హిట్ తీసాం. మళ్లీ ఇన్నాళ్ళకు ఆయనతో పని చేయటం, మా బ్యానర్ తో ఎంతో కాలం గా పరిచయం ఉన్న వేణు శ్రీ రామ్ తో, దేవి శ్రీ ప్రసాద్ తో పని చేయటం ఆనందం గా ఉంది" అని నిర్మాత దిల్ రాజు తెలిపారు.

ఆర్య, బొమ్మరిల్లు, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, బృందావనం, మిస్టర్ పర్ఫెక్ట్, ఎవడు వంటి సూపర్ హిట్ చిత్రాలు నిర్మించిన తమ బ్యానర్ లో ఇది మరొక మంచి చిత్రం అవుతుంది అన్న నమ్మకాన్ని అయన వ్యక్త పరిచారు.

రవి తేజ, అనుపమ పరమేశ్వరన్, ప్రకాష్ రాజ్, నాసర్, రావు రమేష్ ఈ చిత్రం లో ముఖ్య నటులు. కథ - స్క్రీన్ ప్లే - దర్శకత్వం : వేణు శ్రీ రామ్ . కెమెరా : రిచర్డ్ ప్రసాద్ . సంగీతం : దేవి శ్రీ ప్రసాద్ . డైలాగ్స్ : రమేష్ , గోపి . ఎడిటర్ - శ్రీను . కో ప్రొడ్యూసర్స్ - శిరీష్, లక్ష్మణ్ . నిర్మాత : దిల్ రాజు.

English summary
Ravi Teja's new movie Yevado Okadu has been pushed to February 2016.
Please Wait while comments are loading...