For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ఖరారు : మంచు విష్ణు కాదు రవితేజనే

  By Srikanya
  |

  హైదరాబాద్ : అక్షయ్‌ కుమార్ హీరోగా, కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా రూపొందిన హిందీ చిత్రం 'స్పెషల్ చబ్బీస్'. బాలీవుడ్ లో ఈ మద్యనే విడుదలై విజయం సాధించిన ఈ చిత్రం తెలుగులో రీమేక్ చేస్తున్నారంటూ వార్తలు వస్తున్నాయి. ఈ నేపధ్యంలో ఇందులో హీరోగా ఎవరు కనిపించబోతున్నారంటూ స్పెక్యులేషన్స్ జరిగాయి. మంచు విష్ణు, రవితేజ అంటూ వార్తలు వచ్చాయి. అయితే ఫైనల్ గా...రవితేజనే ఖరారు చేసినట్లు తెలుస్తోంది.

  పూర్తి వివరాల్లోకి వెళితే...రవితేజ తొలిసారిగా ఓ హిందీ సినిమా రీమేక్‌లో నటించడానికి పచ్చజెండా ఊపినట్టుగా తెలిసింది. ఆ చిత్రం పేరు 'స్పెషల్ 26'. అక్షయ్‌కుమార్ కెరీర్‌లో మంచి హిట్‌గా నిలిచిపోయిన సినిమా అది. విభిన్న కథాంశంతో రూపొందిన ఆ చిత్రం దక్షిణాది రీమేక్ హక్కులను సీనియర్ నటుడు, దర్శక నిర్మాత త్యాగరాజన్ దక్కించుకున్నారు. తెలుగులో ఆ చిత్రానికి ఎవరు సరిపోతారా అని ఆలోచిస్తే, త్యాగరాజన్‌కు తొలుత తట్టిన పేరు రవితేజ. ఆయన్ను ఈ నేపథ్యంలో త్యాగరాజన్, రవితేజను సంప్రదిస్తే ఆయన కూడా ఓకే చెప్పారని సమాచారం.

  Ravi Teja signs Special 26 Telugu remake

  'స్పెషల్ చబ్బీస్' చిత్రం యదార్థ సంఘటలన ఆధారంగా తెరకెక్కించిన చిత్రమిది. ఈ చిత్రంలో అక్షయ్ నకిలీ పోలీసాఫీసర్‌గా చేశారు. నీరజ్‌పాండే తనదైన శైలిలో చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కించాడు. ఎమ్‌.ఎమ్‌.కీరవాణి స్వరాలు సమకూర్చారు. '1980వ దశకంలో జరిగిన కొన్ని యథార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన చిత్రమిది. సీబీఐ నుంచి వచ్చాం అంటూ నగల దుకాణాల్నీ, పెద్ద పెద్ద పారిశ్రామిక వేత్తల్నీ ఓ బృందం ఎలా దోచుకొందో తెరపైనే చూడాలి. ప్రతి సన్నివేశం వినోదాత్మకంగా సాగుతుంది.

  త్యాగరాజన్ మాట్లాడుతూ... " నేను హిందీలో విజయవంతమైన స్పెషల్ 26 రైట్స్ తీసుకున్నాను. ఆ గోల్డన్ ఆపర్చునిటీ నాకే దక్కింది. సౌత్ లోని నాలుగు భాషల రైట్స్ నా దగ్గరే ఉన్నాయి. నేనే ఈ చిత్రాన్ని స్వయంగా డైరక్ట్ చేస్తాను ". అన్నారు. ఇక త్యాగరాజన్ గతంలో కంగన రనత్ హీరోయిన్ గా వచ్చిన క్వీన్ చిత్రం రీమేక్ రైట్స్ సైతం తీసుకుని ఇప్పటివరకూ మొదలుపెట్టని సంగతి తెలిసిందే.

  గతంలో ‘స్పెషల్ ఛబ్బీస్' చిత్రానికి సంబంధించిన రీమేక్ రైట్స్ దర్శకుడు ఎన్.లింగుస్వామి స్వంతం చేసుకున్నారనే వార్తలు వచ్చాయి. అంతేకాకుండా తానే నిర్మాతగా స్వీయ దర్శకత్వంలో కమల్‌హాసన్‌తో ఈ చిత్రాన్ని రీమేక్ చేయడానికి సంకల్పించారు. విశ్వరూపం సీక్వెల్ పూర్తయిన తరువాత ఈ చిత్రంలో కమల్ నటించనున్నారని అన్నారు అయితే ఇది క్రియారూపం దాల్చలేదు. ఈ లోగా ఏం జరిగిందో ఏమో త్యాగరాజన్ ఈ రైట్స్ ని సొంతం చేసుకున్నాడు. లింగు స్వామి నుంచి తీసుకుని ఉండవచ్చు అంటన్నారు.

  ఈ సినిమా హిందీలో కమర్షియల్ గా సక్సెస్ కావడమే కాకుండా బాక్స్ ఆఫీస్ దగ్గర 50 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. ఈ సినిమా 80లలో కొంతమంది నకిలీ సి.బి.ఐ ఆఫీసర్లుగా బొంబాయిలోని ఒక నగల షాపుని దోచుకున్న యాదార్త సంఘటనల ఆధారంగా రూపొందింది.

  మార్చి 19, 1987లో ఒక అజ్ఞాత వ్యక్తి తాను సీబీఐ అధికారినని నమ్మబలికి 26 మంది ఆదాయపు పన్నుశాఖ అధికారుల బృందంతో ఒపెరా హౌజ్‌లోని త్రిభువన్‌దాస్‌ జవేరీ నగల దుకాణంలో లక్షలాది విలువైన బంగారు ఆభరణాలను దోచుకెళ్లిన సంఘటనను తెరకెక్కించారు. నకిలీ ఐటీ అధికారుల పేరుతో ఇటీవలి సంఘటనల ఆధారంగా దర్శకుడు నీరజ్‌ పాండే ఈ సినిమాను తీసారు. రియా చౌహాన్‌ అనే ఒక ఉపాధ్యాయిని పాత్రలో కాజల్ కనిపించింది.

  కథగా చెప్పాలంటే...ఇది 1987 నాటి కథాంశం. అక్షయ్‌ కుమార్‌ మోసం చేయటంలో నెంబర్‌ వన్‌. అతడి గ్యాంగ్‌లో మరోముగ్గురు. వీరి టార్గెట్‌ రాజకీయ నాయ కులు, బ్లాక్‌మనీ అధికారులు, వ్యాపారవేత్తలు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎవరీ వద్ద బ్లాక్‌మనీ ఉంటే నకిలీ సిబిఐ అధికారులుగా అక్కడ వాలుతారు. నిలువు దోపిడీ చేస్తారు. వీరికి ఇన్‌స్పెక్టర్‌ తోడ్పడతాడు. అసలైన సిబిఐ ఆఫీసర్‌ మనోజ్‌ బాజ్‌పాయ్‌ వీళ్లను పట్టడానికి ప్లాన్‌ మీద ప్లాన్లు వేస్తాడు. వీరి ఆఖరి టార్గెట్‌ బొంబాయిలోని జ్యూయెలరీ షాప్‌. సిబిఐ ఆఫీసర్‌ పక్కా ప్లాన్‌ చేస్తాడు ఈసారి ఎలాగైనా అక్షయ్‌ని పట్టుకోవాలని. చివరికి నేరస్తుడు దొరికాడా? లేదా? అన్నదే క్లైమాక్స్‌. ఈ సినిమాకు సంగీత దర్శకులు చందన్‌ శర్మ, హిమేష్‌ రేష్‌మ్మియా, ఎం.ఎం. కీరవాణి. క్రైం కథని సీరియస్‌గా నడిపించాడు. అక్షయ్‌కుమార్‌, అనుపమ్‌ఖేర్‌, కాజల్‌ బాగా చేశారు.

  రవితేజకు రీమేక్స్ చేయడం కొత్త కాదు కానీ, హిందీ రీమేక్ చేయడం మాత్రం ఇదే ప్రథమం. రవితేజ ఇమేజ్‌కి అనుగుణంగా తెలుగు చిత్రంలో పలు వాణిజ్య అంశాలను జోడించనున్నారట. రవితేజ ప్రస్తుతం 'కిక్-2' సినిమా చేస్తున్నారు. ఆ తర్వాత 'బెంగాల్ టైగర్' ఆరంభమవుతుంది. ఆ తర్వాత 'స్పెషల్ 26' సెట్స్ మీదికి వెళ్తుందని సమాచారం.

  English summary
  Producer Thyagarajan who acquired the remake rights of Akshay Kumar's 'Special 26' for all the South Indian languages has approached Raviteja to play the lead in Telugu version.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X