రవితేజ,త్రిష కాంబినేషన్ మరోసారి
హైదరాబాద్: రవితేజ,త్రిష కాంబినేషన్ లో గతంలో కృష్ణ చిత్రం వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మరోసారి ఈ కాంబినేషన్ కానుందని తెలుస్తోంది. హిందీలో హిట్టైన స్పెషల్ ఛబ్బీస్ రీమేక్ లో ఈ కాంబినేషన్ ని రిపీట్ చేస్తున్నారు. ప్రశాంత్ తండ్రి త్యాగరాజన్ ఈ చిత్రాన్ని తెలుగు,తమిళ రైట్స్ పొందారు. ఈ చిత్రాన్ని ఎవరు డైరక్ట్ చేస్తారనేది తెలియలేదు. త్యాగరాజన్ చేసే అవకాసం ఉందని అంటున్నారు. ఈ మేరకు స్క్రిప్టు వర్క్ జరుగుతోంది.
1987లో సీబీఐ అధికారుల ముసుగులో ఓ బృందం ముంబైలోని బంగారు దుకాణాన్ని పూర్తిగా దోచేసుకుంది. ఆ సంఘటన ఆధారంగానే రెండేళ్ళ క్రితం అక్షయ్ కుమార్ 'స్పెషల్ చబ్బీస్' మూవీ తెరకెక్కింది.

అక్షయ్ కుమార్ హీరోగా, కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా రూపొందిన హిందీ చిత్రం 'స్పెషల్ చబ్బీస్'. 'స్పెషల్ చబ్బీస్' చిత్రం యదార్థ సంఘటలన ఆధారంగా తెరకెక్కించిన చిత్రమిది. ఈ చిత్రంలో అక్షయ్ నకిలీ పోలీసాఫీసర్‌గా చేశారు. నీరజ్‌పాండే తనదైన శైలిలో చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కించాడు. ఎమ్.ఎమ్.కీరవాణి స్వరాలు సమకూర్చారు.
'1980వ దశకంలో జరిగిన కొన్ని యథార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన చిత్రమిది. సీబీఐ నుంచి వచ్చాం అంటూ నగల దుకాణాల్నీ, పెద్ద పెద్ద పారిశ్రామిక వేత్తల్నీ ఓ బృందం ఎలా దోచుకొందో తెరపైనే చూడాలి. ప్రతి సన్నివేశం వినోదాత్మకంగా సాగుతుంది.
మార్చి 19, 1987లో ఒక అజ్ఞాత వ్యక్తి తాను సీబీఐ అధికారినని నమ్మబలికి 26 మంది ఆదాయపు పన్నుశాఖ అధికారుల బృందంతో ఒపెరా హౌజ్‌లోని త్రిభువన్‌దాస్ జవేరీ నగల దుకాణంలో లక్షలాది విలువైన బంగారు ఆభరణాలను దోచుకెళ్లిన సంఘటనను తెరకెక్కించారు. నకిలీ ఐటీ అధికారుల పేరుతో ఇటీవలి సంఘటనల ఆధారంగా దర్శకుడు నీరజ్ పాండే ఈ సినిమాను తీసారు. రియా చౌహాన్ అనే ఒక ఉపాధ్యాయిని పాత్రలో కాజల్ కనిపించింది.


Click it and Unblock the Notifications











