»   » డిసెంబర్ లో మిరపకాయ్ పవర్ చూపించడానికి సిద్దమైన డాన్ శీను..

డిసెంబర్ లో మిరపకాయ్ పవర్ చూపించడానికి సిద్దమైన డాన్ శీను..

Posted By:
Subscribe to Filmibeat Telugu

రవితేజ ఎనర్జీ తగ్గ టైటిల్ తో రూపొందుతున్న చిత్రం మిరపకాయ్. హరీష్ శంకర్ దర్శకత్వంలో ఎల్లో ఫ్లవర్స్ పతాకంపై రమేష్ పుప్పాల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ ఆర్ ఆర్ మూవీ మేకర్స్ కి ఇది అనుబంద సంస్థ. ప్రస్తుతం యూరప్ లో పాటల చిత్రీకరణ జరుపుకుంటోన్న ఈ చిత్రానికి తమన్ సంగీతాన్ని అందిస్తున్నాడు. రిచా గంగోపాధ్యాయ, వేదం ఫేం దీక్షాసేత్ నాయికలుగా నటిస్తున్న ఈ సినిమాని డిసంబర్ చివరి వారంలో విడుదల చెయ్యడానికి సన్నాహాలు చేస్తున్నారు నిర్మాతలు. ప్రస్తుతం ఈ నెల 3 నుండి 3 పాటల్ని యూరప్‌, జర్మని, ఆస్ట్రియా, చెక్‌ రిపబ్లిక్‌, ఫ్రాగ్‌ దేశాల్లో చిత్రీకరిస్తాం. రెండు పాటలు రవితేజ, రిచాలపై, ఓ పాట రవితేజ, దీక్షలపై రాజు సుందరం నృత్యదర్శకత్వంలో చిత్రీకరించడంతో షూటింగ్‌ పార్ట్‌ పూర్తవుతుంది. రవితేజ బాడీ లాంగ్వేజికి తగినట్లుగా అందర్నీ ఎంటర్‌ టైన్‌ చేసే మాస్‌ క్యారెక్టర్‌ ని అద్భుతంగా పోషిస్తున్నారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu