For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ఫ్లాఫ్ దర్శకుడుతో రవితేజ నెక్ట్స్ చిత్రం?

  By Srikanya
  |

  హైదరాబాద్ : రీసెంట్ గా దోచేయ్ అనే డిజాస్టర్ చిత్రం నాగ చైతన్యకు ఇచ్చిన సుధీర్ వర్మ తో రవితేజ తదుపరి చిత్రం చేయబోతున్నారా అంటే అవుననే వినపడుతోంది. స్వామిరారా చిత్రంతో ఇండస్ట్రీని తనవైపు కు తిప్పుకుని, కాపీ కొట్టడం తన జన్మహక్కు అని పదే పదే చెప్పే ఈ దర్శకుడు కి గ్రీన్ సిగ్నల్ రవితేజ ఇచ్చాడంటున్నారు. రవితేజకు ఈ మధ్యన ఓ స్టోరీలైన్ చెప్తే నచ్చి రెడీ చేసుకోమని చెప్పినట్లు సమాచారం. అలాగే కథ అంతా స్వామిరారా తరహాలో ఉందని చెప్పుకుంటున్నారు. అంతా సెట్ రైట్ అయితే త్వరలోనే ఈ ప్రాజెక్టు పట్టాలెక్కే అవకాసం ఉందన్నమాట.

  ఇక రవితేజ తాజా చిత్రం 'కిక్‌-2' విషయానికి వస్తే..

  హైదరాబాద్‌: రవితేజ హీరోగా గతంలో మంచి 'కిక్‌' ఇచ్చిన సినిమాకు సీక్వెల్‌గా వస్తున్న చిత్రం 'కిక్‌-2'. తాజా చిత్రంలో రవితేజ, రకుల్‌ప్రీత్‌ సింగ్‌, రవికిషన్‌ కీలక పాత్రధారులు. ఈ చిత్రానికి సురేందర్‌రెడ్డి దర్శకత్వం వహిస్తుండగా, ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌ పతాకంపై నందమూరి కల్యాణ్‌రామ్‌ నిర్మిస్తున్నారు. ఆగస్టు 21న 'కిక్‌-2'ను విడుదల చేయనున్నారు. ఈ చిత్రానికి ఎస్‌.ఎస్‌.థమన్‌ స్వరాలు అందించారు. ఈ చిత్రానికి సెన్సార్ జరిగి U/A సర్టిఫికేట్ వచ్చింది. చిత్రం రన్ టైమ్ 161 నిముషాలు అని తెలుస్తోంది. చిత్రం విజయంపై టీమ్ మొత్తం నమ్మకంగా ఉన్నారు.

  ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

  Raviteja next may with Sudheer Varma?

  'కిక్‌ 2' గురించి రవితేజ మాట్లాడుతూ...

  మీకో విషయం చెప్పాలి. ఇది 'కిక్‌'కు సీక్వెల్‌ కాదు. రెండూ వేర్వేరు కథలు. 'కిక్‌' శుభం కార్డులో 'కిక్‌ 2' రాబోతోందని హింట్‌ ఇచ్చాం. అయితే అప్పటికి 'కిక్‌ 2' ఆలోచనే లేదు. మూడేళ్ల క్రితం వక్కంతం వంశీ ఓ లైన్‌ చెప్పాడు. దాన్ని రాసుకొంటూ వెళ్తే ఈ సినిమాకి 'కిక్‌ 2' అనే పేరు పెడితే బాగుంటుంది అనిపించింది. 'కిక్‌'లో హీరో పేరు కల్యాణ్‌. 'కిక్‌' అంతా వాడి గోలే. ఇది వాళ్ల అబ్బాయి రాబిన్‌ హుడ్‌ కథ. వీడిదంతా 'కంఫర్ట్‌' గోల.. అదేంటన్నది సినిమా చూస్తే అర్థమవుతుంది అన్నారు.

  ఈ చిత్రం తో తప్పకుండా డబుల్‌ కిక్‌ ఇస్తాం . 'కిక్‌' కంటే ఎక్కువ వినోదం ఉంటుంది. పాటలూ బాగున్నాయి. అన్నింటికంటే ముఖ్యంగా యాక్షన్‌ పార్ట్‌ బాగా వచ్చింది. 'కిక్‌'లో యాక్షన్‌కు అంత చోటు దక్కలేదు. ఈ సినిమాలో మాత్రం పోరాట దృశ్యాలు బాగుంటాయి. ఓ కమర్షియల్‌ సినిమాలో ప్రతి పాత్రకీ ప్రాధాన్యం ఉండడం చాలా అరుదుగా జరిగే విషయం. 'కిక్‌ 2'లో అది సాధ్యమైంది అన్నారు.

  దర్శకుడు మాట్లాడుతూ ‘‘ఈ సినిమా ‘కిక్‌'కు సీక్వెల్‌ కాదు. కానీ అందరికీ డబుల్‌ కిక్‌ ఇస్తుంది. ‘కిక్‌'లో రవితేజ, ఇలియానా జంటగా నటించారు. వాళ్లిద్దరి కొడుకు కథే ‘కిక్‌-2'. రాజస్థాన్‌లోని జైసల్మీర్‌లో క్లైమాక్స్‌ను భారీగా తెరకెక్కించాం. సినిమాలో హైలెట్ అవుతుంది '' అని తెలిపారు.

  నిర్మాత నందమూరి కల్యాణ్‌రామ్‌ మాట్లాడుతూ.... ‘‘అతనొక్కడే వంటి హిట్‌ తర్వాత సురేందర్‌రెడ్డి మా సంస్థలో చేస్తున్నారు. రవితేజ హీరోగా ఈ చిత్రం రూపొందుతోంది. హై టెక్నికల్‌ వేల్యూస్‌తో ఎక్కడా కాంప్రమైజ్‌ కాకుండా సినిమాను రూపొందిచాం. భారీ ఎత్తున విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం'' అని తెలిపారు.

  ఈ చిత్రంలో రవితేజ సరసన రకూల్ ప్రీత్ సింగ్ నటిస్తోంది. ఈ సినిమాకు కథ: వక్కంతం వంశీ, సంగీతం: యస్‌.యస్‌.థమన్‌, కెమెరా: మనోజ్‌ పరమహంస, ఎడిటింగ్‌: గౌతంరాజు, ఆర్ట్‌: నారాయణరెడ్డి, ఫైట్స్‌: రామ్‌-లక్ష్మణ్‌.

  English summary
  According to the sources, Sudheer Varma narrated a line which is similar to ‘Swamy Ra Ra’ but bowled Raviteja. Raviteja asked him to come with complete story and he is working on it. If Raviteja gives green signal, it will go to sets soon.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X