»   »  'కిక్‌-2' : రవితేజ ఇంట్రస్ట్ లేక పోవటానికి కారణం??

'కిక్‌-2' : రవితేజ ఇంట్రస్ట్ లేక పోవటానికి కారణం??

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: రవితేజ హీరోగా సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘కిక్‌-2'. నందమూరి తారక రామారావు ఆర్ట్స్‌ పతాకంపై నందమూరి కల్యాణ్‌రామ్‌ నిర్మిస్తున్నారు. ఆగస్టు 21న 'కిక్‌-2'ను విడుదల చేయనున్నట్లు కల్యాణ్‌రామ్‌ ఈ మధ్యనే తన అధికారిక ఫేస్‌బుక్‌ ఖాతా ద్వారా వెల్లడించిన సంగతి తెలిసిందే. అయితే రవితేజ, సురేంద్ర రెడ్డి మాత్రం ఈ ప్రాజెక్టుపై ఆసక్తి చూపటం లేదు. ఎందుకనేది ఫిల్మ్ సర్కిల్స్ లో విభిన్నమైన కారణాలు వినపడుతున్నాయి. అందులో ఒకటి...

ఈ చిత్రం విడుదల నిర్ణయం విషయంలో కళ్యాణ్ రామ్ ...స్వీయ నిర్ణయం తీసుకోవటమే అంటున్నారు. ఈ నిర్ణయంలో రవితేజ, సురేంద్ర రెడ్డి లను సంప్రదించలేదని చెప్తున్నారు. అలాగే ఆగస్టు 14న ఈ చిత్రం ప్లాటినం డిస్క్ పంక్షన్ చేయాలని కళ్యాణ్ రామ్ డిసైడ్ చేసారు. ఈ పంక్షన్ కు వీరిద్దరూ వస్తారా రారా అనేది ఇప్పుడు అంతటా హాట్ టాపిక్ గా మారింది.


Raviteja not interested in Kick 2?

మరో ప్రక్క ...ఈ చిత్రం వాయిదాల మీద వాయిదాలు పడటానికి కారణం కేవలం ఓవర్ బడ్జెట్ అని తెలుస్తోంది. రేసు గుర్రం పెద్ద హిట్ అవటంతో రవితేజ మార్కెట్ ని కూడా పట్టించుకోకుండా ...బడ్జెట్ ని పెంచుకుంటూ సురేంద్రరెడ్డి వెళ్లారని అంటున్నారు. ముఖ్యంగా రీషూట్ లు చేయటమే సగం కారణం అంటున్నారు. దాంతో ఈ చిత్రం 12 కోట్లు డెఫిషిట్ లో పడిందని చెప్తున్నారు. అనుకున్న స్ధాయిలో బిజినెస్ కాలేదని అందుకే ఈ డెఫిషిట్ అంటున్నారు. ఈ విషయమై దర్శకుడు, నిర్మాత మధ్య వాదోపవాదాలు జరిగి రిలీజ్ డేట్ ఫైనల్ గా ప్రకటించారని చెప్పుకుంటున్నారు.


ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు
ఈ చిత్రానికి ఎస్‌.ఎస్‌.థమన్‌ స్వరాలు అందించారు. తాజా చిత్రంలో రవితేజ, రకుల్‌ప్రీత్‌ సింగ్‌, రవికిషన్‌ కీలక పాత్రధారులు. గతంలో మంచి 'కిక్‌' ఇచ్చిన సినిమాకు సీక్వెల్‌గా వస్తున్న చిత్రం 'కిక్‌-2' కావటంతో మంచి అంచనాలే ఉన్నాయి.


దర్శకుడు మాట్లాడుతూ ‘‘ఈ సినిమా ‘కిక్‌'కు సీక్వెల్‌ కాదు. కానీ అందరికీ డబుల్‌ కిక్‌ ఇస్తుంది. ‘కిక్‌'లో రవితేజ, ఇలియానా జంటగా నటించారు. వాళ్లిద్దరి కొడుకు కథే ‘కిక్‌-2'. రాజస్థాన్‌లోని జైసల్మీర్‌లో క్లైమాక్స్‌ను భారీగా తెరకెక్కించాం. '' అని తెలిపారు.


చిత్రం ట్రైలర్ ఇక్కడ చూడండి...నందమూరి కల్యాణ్‌రామ్‌ మాట్లాడుతూ ‘‘అతనొక్కడే వంటి హిట్‌ తర్వాత సురేందర్‌రెడ్డి మా సంస్థలో చేస్తున్నారు. రవితేజ హీరోగా ఈ చిత్రం రూపొందుతోంది. హై టెక్నికల్‌ వేల్యూస్‌తో ఎక్కడా కాంప్రమైజ్‌ కాకుండా సినిమాను రూపొందిస్తున్నాం. ఆగస్టు 21 న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం'' అని తెలిపారు.


ఆద్యంతం వినోద ప్రధానంగా సాగే చిత్రమని రవితేజ అన్నారు. 'కిక్'లో జంటగా నటించిన రవితేజ, ఇలియానా పాత్రల కొడుకు కథే ఈ 'కిక్ 2' అని దర్శకుడు తెలిపారు. నిర్మాత మాట్లాడుతూ...యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కనున్న ఈ చిత్రంలో రవితేజ మార్క్ ఎంటర్‌టైనర్‌తోపాటు సురేందర్ రెడ్డి, తమన్నా మ్యాజిక్ మళ్లీ రిపీట్ కానుంది.


ఈ చిత్రంలో రవితేజ సరసన రకూల్ ప్రీత్ సింగ్ నటిస్తోంది. ఈ సినిమాకు కథ: వక్కంతం వంశీ, సంగీతం: యస్‌.యస్‌.థమన్‌, కెమెరా: మనోజ్‌ పరమహంస, ఎడిటింగ్‌: గౌతంరాజు, ఆర్ట్‌: నారాయణరెడ్డి, ఫైట్స్‌: రామ్‌-లక్ష్మణ్‌.


English summary
Both Raviteja and Surender Reddy are not showing interest in Kick 2 film and it is coming out that producer Kalyan Ram took solo decision to release the film on Aug 21.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu