»   » నచ్చకే రవితేజ సినిమా రీషూట్..అందుకే ఫోస్ట్ ఫోన్

నచ్చకే రవితేజ సినిమా రీషూట్..అందుకే ఫోస్ట్ ఫోన్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : రిలీజ్ అయ్యాక...ఫలానా సీన్ బాగోలేదు..లేదా ఇంకా బాగా తీసి ఉంటే బాగుండేది అని ఎన్ని అనుకున్నా...ఎన్నిసార్లు మొత్తుకున్నా ఫలితం ఉండదు. అది స్టార్ డైరక్టర్స్ గా ఎదిగిన వాళ్లకు తెలుసు. మాగ్జిమం తాము సాటిస్ ఫై అయ్యేదాకా వారు తీస్తూనే ఉంటారు. అటువంటి దర్శకులలో సురేంద్రరెడ్డి ఒకరు. ఆయన తను అనుకున్నది అనుకున్నట్లు రాకపోతే మళ్లీ కష్టపడటానకి వెనుకాడరని అంటారు. అదే ప్రాసెస్ లో కిక్ 2 రీషూట్ చేస్తున్నట్లు సమాచారం. అందుకే చిత్రం విడుదలను ఫోస్ట్ ఫోన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు కొన్ని సీన్లను ఆర్ ఎఫ్ సి లో రీ షూట్ చేస్తున్నట్లు సమాచారం.

సమ్మర్‌ సీజన్‌లో మంచి కిక్‌ ఎక్కించే చిత్రంగా ప్రచారం పొందిన 'కిక్‌ 2' విడుదల తేదీపై ఇంకా సందిగ్దత నెలకొంది. రవితేజ కథానాయకుడిగా సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో నటుడు కళ్యాణ్‌రామ్‌ నిర్మించిన ఈ చిత్రం కమర్షియల్‌గా మంచి విజయం సాధిస్తుందని ట్రేడ్‌ వర్గాలు భావిస్తున్నాయి. ఖర్చు ఎక్కువైనప్పటికీ అంచనాలు బాగా ఉన్నాయి.


Raviteja's Kick 2 re-shoot in RFC

మేలోనే రావాల్సిన ఈ చిత్రం జూన్‌కు వాయిదా పడింది. యూనిట్‌ వర్గాల సమాచారం ప్రకారం జూన్‌ 26న విడుదల చేస్తారని తెలిసింది. అదే రోజు 'రుద్రమదేవి' కూడా విడుదలకానుంది. రెండు ప్రతిష్టాత్మక చిత్రాలే కావడం వల్ల ఎక్కువ థియేటర్లు కావాలి. మరి ఎవరైనా వెనక్కివెళతారా లేకు సర్దుకుపోతారానేది తేలాలి.


నందమూరి తారక రామారావు ఆర్ట్స్‌ పతాకంపై నందమూరి కల్యాణ్‌రామ్‌ నిర్మిస్తున్నారు. రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్. రవితేజ మార్కు ఎంటర్టెన్మెంట్, సురేందర్ రెడ్డి మార్కు స్క్రీన్ ప్లేతో సినిమా ఆసక్తికరంగా ఉంటుందని అంటున్నారు.


మరో ప్రక్క ఈ సినిమా కు రన్ టైమ్ ప్రాబ్లం వచ్చిందని సమాచారం. 3 గంటలు పైగా సినిమా వచ్చిందని, అయితే అంత రన్ టైమ్ థియోటర్స్ లో వర్కవుట్ కావటంలేదని డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్ చెప్తున్న నేపధ్యంలో దాని లెంగ్త్ తగ్గించాలని ఎడిటర్ గౌతమ్ రాజు కృషి చేస్తున్నట్లు సమాచారం. అయితే ప్రతీ సీన్...కీలకమైందిగా ఉందని దాంతో ఏ సీన్ ఎడిట్ చేసి లెంగ్త్ తీసేయాలనే సందిగ్దంలో ఉన్నట్లు చెప్పుకుంటున్నారు.


ఈ సినిమాపై భారీ అంచనలు ఉన్నాయి. దాంతో ఈ సినిమా శాటిలైట్ రైట్స్ రిలీజ్ కి ముందే ఓ బంపర్ ప్రైజ్ కి అమ్ముడుపోయాయి. ప్రముఖ టీవీ ఛానల్ జెమిని వరు సుమారు 7.5 కోట్లకి ఈ సినిమా శాటిలైట్ రైట్స్ ని దక్కించుకున్నారు. రిలీజ్ కి ముందే ఈ రేంజ్ రేటు పలకడంతో నిర్మాత కళ్యాణ్ రామ్ చాలా హ్యాపీగా ఉన్నాడు. ఈ సినిమాకు కథ: వక్కంతం వంశీ, సంగీతం: యస్‌.యస్‌.థమన్‌, కెమెరా: మనోజ్‌ పరమహంస, ఎడిటింగ్‌: గౌతంరాజు, ఆర్ట్‌: నారాయణరెడ్డి, ఫైట్స్‌: రామ్‌-లక్ష్మణ్‌.

English summary
Surender Reddy who was not satisfied with ‘Kick 2’ output is re-shooting some scenes at RFC.
Please Wait while comments are loading...