»   » పవన్ కళ్యాణ్ పై ఆ రూమర్స్ మొదలవ్వటానకి కారణాలేమిటి

పవన్ కళ్యాణ్ పై ఆ రూమర్స్ మొదలవ్వటానకి కారణాలేమిటి

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఈ రూమర్స్ చూసి నేను షాక్ అయ్యాను..ఇలాంటివి ఎందుకు పుట్టిస్తారో అర్థం కాదు. మా ఇద్దరి ప్రేమబంధం సుస్థిరమైనదని మీడియాతో రేణుదేశాయ్ చెప్పిన సంగతి తెలిసిందే. కొద్దికాలం క్రితం రేణుదేశాయ్‌ లగేజితో సహా పూణె వెళ్లారని, పవన్ మాత్రం హైదరాబాద్‌లో ఉండిపోయారని, దాంతో వీరిమధ్య ఏదో జరిగిందంటూ కొన్ని కధలు ప్రచారంలోకి వచ్చాయి. అయితే అదంతా రబ్బీస్ అని ఆమె కొట్టిపారేస్తూ ఇలాంటి విషయాలేవీ మా పిల్లల చెవిన పడకూడదని జాగ్రత్తలు పడుతున్నట్లు చెప్పారు. అయితే ఈ హఠాత్తుగా ఈ రూమర్స్ పుట్టడానకి కారణాలేంటి అని విశ్లేషిస్తే కొన్ని విషయాలు బయిటకు వచ్చాయి. నిజానికి బద్రి, జానీ వంటి సినిమాల్లో పవన్‌తో కలిసి నటించిన రేణూ, ఆ తర్వాత ప్రేమలో పడి ఆరేళ్లపాటు సహజీవనం సాగించారు. అది పెద్ద వివాదం కావడంతో పవన్ తన మొదటిభార్య నందినికి పరిహారం చెల్లించి విడాకులు తీసుకొని రేణును 2009లో వివాహమాడారు. వీరికి ప్రస్తుతం ఇద్దరు పిల్లలు. బాబు పేరు అఖిరానందన్, పాప పేరు ఆదియా. పవన్ కళ్యాణ్ పూణెలో ఒక ఇళ్లు కొనుక్కొని అక్కడికి మారినప్పటి నుంచి ఈ రూమర్స్ మొదలయ్యాయి. జూబ్లిహిల్స్‌లోని ఆయన ఇంటిని పునర్నిర్మాణం కోసం పడేశారు. అందుకే పూణె వెళ్లారు. కేవలం సినిమా షూటింగ్‌లకే హైదరాబాద్ వస్తుంటారు. అయితే బాబు చదువు కోసమే ఆమె పవన్‌తో హైదరాబాద్ రాలేకపోతున్నారని పవన్ సన్నిహితులు చెప్తున్నారు. ప్రస్తుతం పవన్ ...షాడో షూటింగ్ లో బిజీగా ఉన్నారు. ఆ తర్వాత గబ్బర్ సింగ్ చిత్రం చేయటానకి స్క్రిప్టు రెడీ చేసుకుంటున్నారు.

English summary
Renu Desai said, “I am shocked with these baseless speculations and I don’t know how these rumors cropped up. We have been in love from 11 years and will be together for many more years, so the question of split is just ruled out.” All this has started when Renu recently moved to Pune with her both kids Akira Nandan and Aadhiya while Pawan stayed back in Hyderabad.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu