»   » అది మనస్సులో పెట్టుకునే, సమంత కొత్త సినిమాలకు నో ?

అది మనస్సులో పెట్టుకునే, సమంత కొత్త సినిమాలకు నో ?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్:"అ..ఆ" చిత్రం విజయం తర్వాత సమంత వరసపెట్టి సినిమాలు కమిటవ్వుతుందని అంతా భావించారు. అయితే అలాంటిదేమి జరగటం లేదు. ఆమె దగ్గరకు వరస ప్రాజెక్టులు వస్తున్నా ఏదీ ఒప్పుకోవటం లేదని సమాచారం. కేవలం తాను కమిటైన జనతాగ్యారేజ్, ధనుష్ తో చేస్తున్న వడ చెన్నై మాత్రమే పూర్తి చేసే ఆలోచనలో సమంత ఉందని తెలుస్తోంది.

అందుకు కారణం..ప్రేమ వ్యవహారం పెళ్లి దాకా వెళ్లటమే అంటున్నారు తెలుగు సినీ జనం. నాగచైతన్యతో ఆమె లవ్ ఎఫైర్...త్వరలో వివాహంగా రూపుదాల్చనుందని, ఈ సమయంలో సినిమాలు కమటయితే ఆ తర్వాత ఇబ్బంది అవుతుందని భావిస్తోందని చెప్పుకుంటున్నారు.

Samantha

అంటే ఆమె వివాహం నిశ్చియమైనట్లేనా లేక ప్రాసెస్ లో ఉందా...ఈ రెండింటిలో ఏదో ఒకటి జరుగతూండబట్టే అది మనస్సులో పెట్టుకుని సమంత ఇలా నో చెప్తోందని అంటున్నారు. అయితే కొందరు మాత్రం ఆమె వరస సినిమాలు చేసి విశ్రాంతి కోల్పోయింది. అందుకే ఈ రెండు చిత్రాలు కూడా పూర్తి చేసి గ్యాప్ తీసుకుని మళ్లీ వస్తందని చెప్తున్నారు.

మరి సమంత ఏది నిజమో...ఫ్యాన్స్ అడిగే ఈ ప్రశ్నలకు ట్విట్టర్ ద్వారా ఎప్పుడు సమాధానం చెప్తుందో చూడాలి. అయితే సినిమాలు మాత్రం బ్రేక్ ఇస్తే మాత్రం ఫ్యాన్స్ పూర్తిగా హర్ట్ అవుతారు అది గుర్తుంచుకో సమంత.

English summary
Samantha Ruth Prabhu, isn't signing any new movie after A..Aa release. Currently she has only Janata Garage in hand and then there is clarity over Danush's Vada Chennai.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu