»   » ఫ్లాఫ్ హీరో సుమంత్ కి కంటిన్యూగా సినిమాలు రావటానికి కారణం?

ఫ్లాఫ్ హీరో సుమంత్ కి కంటిన్యూగా సినిమాలు రావటానికి కారణం?

Posted By:
Subscribe to Filmibeat Telugu

సుమంత్ కెరీర్ మొత్తం సత్యం చిత్రం తప్ప చెప్పుకోవటానికి ఇప్పటికి హిట్టు లేదు. అయినా అతనికి వరసగా సినిమాలు వస్తూనే ఉన్నాయి. వరసగా తన స్ధాయి మేరకు ప్లాప్ లు ఇస్తూనే ఉన్నాడు. అంతెందుకు రీసెంట్ గా వచ్చిన గోల్కొండ హై స్కూల్‌, రాజ్‌ లు డిజాస్టర్ అయినప్పటికీ అతనికి ఇంకా అతని చేతిలో మరో మూడు సినిమాలు ఉన్నాయి. దీనికి కారణం ఏమిటి అని మిగతా హీరోలు తల బ్రద్దలు కొట్టుకుంటున్నారు. ఎందుకంటే సుమంత్ ఏమీ తనతో చేయబోయే సినిమాకు పెట్టుబడి కూడా పెట్టడు..అలాగని అతనికి శాటిలైట్ డిమాండ్ లేదు. ఓపినింగ్స్ రావు.మరి ఎక్కడుంది సుమంత్ కి సుడి అంటే అతని మేనమామకు మా టీవి ఉండటమే అని తేలింది.

సుమంత్ నటించిన ప్రతీ చిత్రం తప్పని సరిగా మా టీవీ వారు మంచి రేటు ఇచ్చి శాటిలైట్ రైట్స్ తీసుకుంటారు. అలాగే సుమంత్ సినిమా ఆగిపోయిందంటే నామేషి అని ఎలాగోలా విడుదల చేయటానకి అక్కినేని కుటుంబం వారు ముందుకొస్తారు. ఇక శాటిలైట్ రైట్స్ గ్యారెంటీ అనుకున్నాక దాన్ని అడ్డం పెట్టి ఫైనాన్స్ తెచ్చుకోవచ్చు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకునే నిర్మాతలు సుమంత్ ని సంప్రదిస్తున్నట్లు తెలుస్తోంది.వీటతో పాటు సుమంత్ సెట్లో వేరే యావిగేషన్స్ పెట్టుకోవటం కానీ, నిర్మాతలను తన గొంతెమ్మ కోరికలతో వేధించటం కానీ చేయటట. ఇదంటీ సుమంత్ విజయ రహస్యం.ప్రస్తుతం సుమంత్..రవి చావలి దర్శకత్వంలో ఓ చిత్రం చేస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతోంది.

English summary
The latest film of Sumanth directed by Ravikumar Chavali and produced by J Sambasiva Rao on the banner of Sudha Cinema had completed over 40% shooting recently.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu