For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  చైతుతో సమంత విడాకులు.. అసలు కారణం ఇదే.. డైవోర్స్ కోసం అక్కినేని ఫ్యామిలీ ఎన్ని కోట్లు చెల్లిస్తున్నారంటే?

  |

  సినిమా పరిశ్రమలో అక్కినేని నాగచైతన్య, సమంత విడాకుల అంశం గతంలో ఎప్పుడూ లేనంతగా ఇప్పుడు హాట్ హాట్‌గా చర్చ జరుగుతున్నది. మీడియాలో వారిద్దరి మ్యారేజ్ బ్రేకప్ వార్తలు గుప్పుమంటున్నాయి. అయితే తమ బ్రేకప్ గురించి సమంత పరోక్షంగా హింట్స్ ఇస్తున్నప్పటికీ.. అక్కినేని ఫ్యామిలీ మాత్రం గుంభనంగా వ్యవహరిస్తున్నది. అయితే నాగచైతన్యతో సమంత విడాకులు విషయం వాస్తవమేనని సినీ వర్గాలు ధృవీకరిస్తున్నాయి. అయితే సమంత విడాకుల వెనుక కారణాలు, నాగచైతన్య ఇచ్చే భరణం అంశాలు ఇప్పుడు మీడియాలో చర్చనీయాంశమయ్యాయి. ఆ వివరాల్లోకి వెళితే..

  అక్కినేని ట్యాగ్ తొలగించడంతో

  అక్కినేని ట్యాగ్ తొలగించడంతో

  నాగ చైతన్య‌తో దాంపత్య జీవితం సానుకూలంగా సాగుతున్నదని అనుకొంటున్న సమయంలో ఉన్నట్టుండి తన ఇంటి పేరు నుంచి అక్కినేనిని సమంత తొలగించడం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది. దాంతో ఏదో జరుగుతున్నదనే అనుమానాలు వెంటనే బలపడ్డాయి. అయితే వారిద్దరి మధ్య అభిప్రాయ బేధాలు తలెత్తాయనే విషయాన్ని సినీ వర్గాలు ధృవీకరించాయి.

  Sai Pallavi స్టన్నింగ్ అండ్ బ్యూటిఫుల్ ఫోటో గ్యాలరీ..

  పెళ్లి తర్వాత కూడా హాట్‌గా నటించడంపై

  పెళ్లి తర్వాత కూడా హాట్‌గా నటించడంపై

  సమంత కుటుంబ నేపథ్యం విషయానికి వస్తే.. అతి సాధారణ ఫ్యామిలీ నుంచి అగ్రతారగా ఎదిగింది. సినిమా అంటే విడదీయలేని అనుబంధం ఏర్పడింది. అయితే పెళ్లి తర్వాత సినిమాలకు దూరం కావాలని అక్కినేని ఫ్యామిలీ పెట్టిన ఆంక్షలను సమంత పట్టించుకోకపోవడంతో గందరగోళం నెలకొన్నది. పెళ్లి తర్వాత హాట్ హాట్ ఫోటోషూట్స్, సినిమాల్లో గ్లామరస్ రోల్స్, అందాల ఆరబోతకు పాల్పడటం అక్కినేని ఫ్యామిలీకి రుచించలేదట. దాంతో ఆమెకు పలుమార్లు సర్ది చెప్పిన ఆ ప్రయత్నాలు సఫలం కాకపోవడం సమంతపై ఆగ్రహానికి కారణమైందట.

  ఫ్యామిలీ మ్యాన్‌ 2లో బోల్డ్ రోల్‌తో

  ఫ్యామిలీ మ్యాన్‌ 2లో బోల్డ్ రోల్‌తో

  అయితే కుటుంబ మర్యాద, పరువు అంశాలను దృష్టిలో పెట్టుకోవాలని పదే పదే సూచించినా సమంత పెడచెవిన పట్టినట్టు సమాచారం. అయితే పలుమార్లు అక్కినేని కుటుంబంలోకి అడుగుపెట్టిన తర్వాత అమల మాదిరిగా జీవితాన్ని అనుసరించాలని చెప్పారట. అయినా సమంత తన పంథానే కొనసాగించడంతో చైతూతో గ్యాప్ పెరిగిపోయిందని సినీ వర్గాలు చెప్పుకొంటున్నాయి అయితే ఫ్యామిలీ మ్యాన్ 2 చిత్రంలో బోల్డ్ రోల్ చేసిన తర్వాత నాగచైతన్యతో దూరం మరింత పెరిగిందని, అదే వారిద్దరూ విడిపోవాలనే నిర్ణయానికి ప్రధాన కారణమని తెలుస్తున్నది.

  చైతూ, సమంత మధ్య దూరం

  చైతూ, సమంత మధ్య దూరం

  అయితే తనకు అత్యంత గుర్తింపు, హోదా, పాపులారిటీని వదులుకోవడానికి సమంత ఇష్టపడకపోవడమే విడాకుల వరకు ఈ వివాదం వచ్చింది. తన పాపులారిటికి కారణం అక్కినేని ట్యాగ్ కాదని బలంగా నమ్మిన సమంత.. ఆ పరిస్థితుల్లోనే తన పేరు నుంచి అక్కినేనిని తొలగించిందని చెప్పుకొంటున్నారు. దాంతో అక్కినేనికి సమంతకు దూరం మరింత పెరిగిందనే విషయం స్పష్టమైంది.

  పలుమార్లు కౌన్సిలింగ్ ఇచ్చినా..

  పలుమార్లు కౌన్సిలింగ్ ఇచ్చినా..

  విడాకులకు దరఖాస్తు చేసుకొన్న తర్వాత ఫ్యామిలీ కోర్టులో సమంత, నాగ చైతన్యకు పలుమార్లు కౌన్సిలింగ్ ఇచ్చారని, ఆ తర్వాత కూడా వారిద్దరు కూడా విడిపోవడానికి మొగ్గు చూపారు. దాంతో వారి జీవితంలో విడాకులు తప్పనిసరి అయ్యాయి. డైవోర్స్ ప్రాసెస్ మరో రెండు మూడు నెలల్లో పూర్తి అవుతుంది అని ప్రముఖ ఆంగ్ల దినపత్రిక తన కథనంలో వెల్లడించింది.

  Director Sekhar Kammula Exclusive Interview About 'Love Story' | Part 3
  అక్కినేని ఫ్యామిలీ 50 కోట్ల భరణం ఇచ్చేందుకు

  అక్కినేని ఫ్యామిలీ 50 కోట్ల భరణం ఇచ్చేందుకు

  ఇక డైవోర్స్ తీసుకొన్నందున్న అక్కినేని కుటుంబం దాదాపు 50 కోట్ల భరణాన్ని ఇచ్చేందుకు సిద్ధమైంది. అవి ఆస్తులు, నగదు రూపంలో ఇవ్వడానికి సానుకూలంగా ఉంది. ప్రస్తుతం వీరిద్దరి విడాకుల అంశాన్ని ప్రముఖ యూట్యూబ్ ఛానెల్‌ వీడియోను రిలీజ్ చేసింది. ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది అని సదరు ఆంగ్ల దినపత్రిక తన కథనంలో పేర్కొన్నది.

  English summary
  Popular Star couple in south, Akkineni Naga Chaitanya marriage break up with Samantha Ruth Prabhu news goes viral in the social media. As per report They are going to seperate in two, Three months. As per TOI, Samantha will reportedly receive a total of Rs 50 crore as alimony for the divorce
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X