Deepika Padukone: కల్కి 2 నుంచి దీపిక పదుకోన్‌ను తప్పించడానికి అసలు కారణం అదేనా?
ఇండియన్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించనున్న స్పిరిట్ సినిమా నుంచి దీపిక పదుకోన్ తప్పుకొన్న తర్వాత ఆమెను కల్కి 2898 AD మూవీ నుంచి తప్పిస్తారనే ఊహగానాలు మీడియాలో వెలుగు చూశాయి. అయితే దీపిక వ్యవహార తీరు, డిమాండ్లను భరించలేని నిర్మాతలు ఆమెను సినిమా నుంచి తప్పించినట్టు అధికారికంగా వైజయంతీ మూవీస్ వెల్లడించిన తర్వాత గతంలోని ఊహాగానాలు కరెక్టే అనే టాక్ ప్రస్తుతం వినిపిస్తున్నది. అయితే ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న కల్కి దీపిక పదుకోన్‌ను తొలగించడం వెనుక కారణాల్లోకి వెళితే..
ప్రభాస్, సందీప్ రెడ్డి వంగ కాంబినేషన్‌లో వస్తున్న స్పిరిట్ సినిమా కోసం దీపిక పదుకోన్‌తో చర్చలు జరిపారు. అయితే చర్చల దశలో నాన్ డిస్క్లోజర్ అగ్రిమెంట్‌ను తుంగలో తొక్కిందనేది ప్రధాన కారణం. తన సినిమా కథను బయటి వారికి వెల్లడించారు. అది అగ్రిమెంట్‌కు వ్యతిరేకమని విషయాన్ని సందీప్ రెడ్డి వంగా సోషల్ మీడియా పోస్టులో వెల్లడించారు.

అయితే ఆ సమయంల స్పిరిట్ కోసం దీపిక పెట్టిన డిమాండ్‌ను నిర్మాతలు ఒప్పుకోలేదు. ఆమె తన 25 మంది సిబ్బంది కోసం స్టార్ హోటల్ బుక్ చేయాలి. అలాగే ముంబై నుంచి చార్టెడ్ ఫ్లయిట్ ఏర్పాటు చేయాలి. అలాగే 20 కోట్ల రూపాయల రెమ్యునరేషన్‌తోపాటు లాభాల్లో వాటా కూడా ఇవ్వాలి అనే డిమాండ్స్ చేసింది. అయితే అందుకు స్పిరిట్ నిర్మాతలు ఒప్పుకోలేదు అనే విషయం గురించి మీడియాలో చర్చ జరిగింది.
ఇక కల్కి నుంచి దీపికను తీసేసినట్టు ప్రకటించిన తర్వాత సోషల్ మీడియాలో పలు కథనాలు బయటకు వచ్చాయి. హిందూస్థాన్ టైమ్స్ రాసిన కథనం ప్రకారం.. కల్కి సినిమా కోసం ఓ అమౌంట్‌ను రెమ్యునరేషన్‌గా అగ్రిమెంట్ చేసుకొన్నది. ఆ మేరకు ఆమె మూవీ కోసం కొంత భాగాన్ని ఆమె షూట్ కూడా చేసింది. దాంతో ఇక ఈ సినిమా నుంచి తీసి వేయడం కుదరదని ఆమె టీమ్ నిర్ణయానికి వచ్చిన తర్వాత రెమ్యునరేషన్ పెంచాలని డిమాండ్ చేశారు. దాంతో కల్కి నిర్మాతలు చర్చలు ఆమెతోను, ఆమె టీమ్‌తోను చర్చలు జరిపారు. కానీ ఆ చర్చలు సఫలం కాలేకపోవడంతో కొంత గందరగోళం నెలకొన్నది అని పేర్కొన్నారు.
అయితే దీపికతో కల్కి టీమ్ చర్చలు పార్ట్ 2 కోసం ప్లానింగ్ చేశారు. కానీ దీపక మాత్రం డిస్కషన్స్ జరుగుతుండగానే అట్లీ, అల్లు అర్జున్ కాంబినేషన్‌లో వస్తున్న మరో పాపులర్ ప్రాజెక్ట్‌కు డేట్స్ కేటాయించారు. దాంతో కల్కి నిర్మాతలు మనస్తాపానికి గురయ్యారు. దాంతో ఆమెను ఈ సినిమాను తప్పించాలని నిర్ణయం తీసుకొన్నారు. ఈ మేరకు అధికారిక ప్రకటన విడుదల చేశారు.
కల్కి 2898 AD సినిమా సీక్వెల్ నుంచి దీపిక పదుకోన్‌ను తప్పించాం. ఆమెకు ఈ సినిమాతో ఎలాంటి అనుబంధం లేదని అధికారికంగా వెల్లడిస్తున్నాం. అన్ని విషయాలను జాగ్రత్తగా పరిశీలించిన తర్వాత ఆమెతో సామరస్యంగా తెగతెంపులు చేసుకొన్నాం. కల్కి మొదటి భాగం కోసం సుదీర్ఘమైన ప్రయాణం చేసినప్పటికీ.. మా మధ్య సరైన భాగస్వామ్యం నెలకొన లేదు. కల్కి 2898 AD లాంటి సినిమాకు ధృడమైన సంకల్పం, అంకిత భావం ఉండాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకొన్నాం. ఆమెకు భవిష్యత్‌లో అంతా మంచే జరుగాలని కోరుకొంటున్నాం అని వైజయంతీ మూవీస్ ఓ ప్రకటనలో తెలిపారు.


Click it and Unblock the Notifications











