»   » పవన్ రిజెక్ట్ చేస్తే , ఫ్యాన్ దగ్గరకు వెళ్లి డైలమోలో పడేసాడు

పవన్ రిజెక్ట్ చేస్తే , ఫ్యాన్ దగ్గరకు వెళ్లి డైలమోలో పడేసాడు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: సంపత్ నంది.. ఈ పేరు ..రచ్చ సినిమా హిట్ కన్నా ..సర్దార్ గబ్బర్ సింగ్ కోసం పవన్ చేత రిజెక్ట్ చేయబడ్డ డైరక్టర్ గా పడ్డ డైరక్టర్ అనే పాపులారిటనే ఎక్కువ వచ్చింది. దాదాపు ఆల్మోస్ట్ సంవత్సరం పాటు పవన్ తో జర్నీ చేసిన సంపత్ నంది... ఆ తర్వాత ఏం క్రియేటివ్ విభేధాలు వచ్చాయో కానీ బయిటకు వచ్చేసారు. ఆ ప్లేస్ లోకి దర్శకుడు బాబి వచ్చి చేరారు. అఫ్ కోర్స్ బాబి ఆ ప్రాజెక్టుని నిలబెట్టుకోలేదనికోండి.

ఆ తర్వతా సంపత్ నంది..రవితేజ తో బెంగాళ్ టైగర్ చిత్రం చేసారు. ఆ చిత్రం కూడా యావరేజ్ గ్రాసర్ అయ్యింది. అంతా సర్దార్ గబ్బర్ సింగ్ నుంచి తప్పుకోవటం మేలైంది లేకపోతే పవన్ కు యావరేజ్ ఇచ్చేవాడు అనుకున్నారు. కానీ తర్వాత పవన్ రాసిన స్క్రిప్టుతో బాబి డైరక్ట్ చేసిన సినిమాతో ఆ మచ్చ సంపత్ నందికి తొలిగిపోయిందనే చెప్పాలి. కానీ అతనికి కలిసి వచ్చిందేమీ లేదు. బెంగాళ్ టైగర్ చిత్రం తర్వాత అతనికి సినిమా ఏ హీరో ఇవ్వలేదు.

Rejected Director Goes To His Fan!

ఇప్పుడు అవన్నీ ప్రక్కన పెడితే పవన్ కు వీరాభిమాని అయిన నితిన్ తో సంపత్ నంది ముందుకు వెళ్లాలని నిర్ణయించుకున్నారని ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం. ప్రస్తుతం నితిన్ ..త్రివిక్రమ్ తో చేస్తున్న అ..ఆ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనిలో ఉన్నాడు. ఆ సినిమా తర్వాత ఆయన ఏ చిత్రం కమిట్ కాలేదు.

ఓ ప్రక్క రేసులో నితిన్ తో చేయటానికి నందిని రెడ్డి, నేను శైలజ దర్శకుడు కిషోర్ ఉన్నారు. వీళ్లలో ఎవరికి గ్రీన్ సిగ్నల్ ఇస్తాడు నితిన్ అనుకుంటూంటే...గుండెజారి గల్లంతైంది దర్శకుడు కూడా నితిన్ తో సీక్వెల్ చేయాలని తిరుగుతున్నారు. వీళ్ల మధ్యలోకి సంపత్ నంది వచ్చి పడ్డారు.

Rejected Director Goes To His Fan!

అయితే సంపత్ నంది వీళ్లందరి కన్నా స్పీడుగా ఉన్నాడని, డైలాగ్ వెర్షన్ తో కూడిన యూత్ ఫుల్ ఎంటర్టైనర్ పట్టుకుని నితిన్ ని ఎప్రోచ్ అయ్యాడని చెప్తున్నారు. నితిన్ కూడా ఆలోచనలో పడ్డారని చెప్పుకుంటున్నారు. ముందు మాట ఇచ్చిన కమిట్ మెంట్స్ కి కట్టుబడి ఉందామా లేక సంపత్ నందితో ముందుకు వెళ్దామా అనే డైలమోలో ఉన్నాడట. అదండీ విషయం.

English summary
Sampath Nandi reportedly approached Nithin, who is an ardent Pawan Kalyan fan as well all know. He approached Nithin with a Youthful entertainer script.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu