ఎఎన్నార్ కి జంటగా రేఖ ఎంపిక?
ఈ చిత్రంలో శ్రియ, సమంత ...నాగార్జున,నాగచైతన్యలకు హీరోయిన్స్ గా చేస్తున్నారు. విక్రమ్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. మరి అక్కినేని నాగేశ్వరరావు కు జోడిగా ఎవరని తీసుకువస్తారు అనే సందేహం చాలా మందికి కలిగింది. అయితే రేఖను ఈ ప్రాజెక్టులోకి తీసుకురావటానికి ప్రయత్నాలు జరుగుతన్నట్లు సమాచారం.
మరో ప్రక్క రోహిణి హట్టంగిడి పేరు కూడా నలుగుతోంది. రేఖ నో చెపితే ఆమెను తీసుకునే ఆలోచనలో ఉన్నట్లు చెప్తున్నారు. అయితే రేఖను పెడితే క్రేజ్ వేరే రకంగా ఉంటుందని భావిస్తున్నారు. ఈ వారంలో ఫైనలైజ్ అవుతుందని అంటున్నారు.
ఇక సోమవారం హైదరాబాద్‌లో పూజా కార్యక్రమాల్ని నిర్వహించారు. నాగచైతన్య కెమెరా ముందుకు వచ్చినప్పటి నుంచీ అక్కినేని హీరోలు ముగ్గురూ నటించే చిత్రం కోసం ప్రయత్నాలు మొదలయ్యాయి. 'ఇష్క్' రూపొందించిన విక్రమ్ చెప్పిన కథ నచ్చడంతో ఈ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు. అనూప్ రూబెన్స్ సంగీతం, పి.ఎస్.వినోద్ ఛాయాగ్రహణం సమకూరుస్తారు.


Click it and Unblock the Notifications












