»   » రామ్ చరణ్ చిత్రం ప్లాప్ టాక్ పై నిర్మాత

రామ్ చరణ్ చిత్రం ప్లాప్ టాక్ పై నిర్మాత

By Srikanya
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  హైదరాబాద్ : రామ్ చరణ్ నటించిన తొలి బాలీవుడ్ మూవీ 'జంజీర్' చిత్రం సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని విడుదలకు ముస్తాబవుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో ఈ చిత్రంపై బాలీవుడ్ మీడియాలో ఓ రేంజిలో ప్లాప్ సినిమా అంటూ నెగిటివ్ ప్రచారం జరుగుతోంది. అమితాబ్ జంజీర్ తో 1% కూడా పోలిక వచ్చే చిత్రం కాదని పబ్లిసిటీ చేస్తున్నారు. అయితే ఈ విషయాన్ని నిర్మాత రిలియన్స్ వారు ఖండిస్తున్నారు.

  రిలియన్స్ ఎంటర్టైన్మెంట్ వారు ఈ విషయమై స్పందిస్తూ...ఏం జోక్ చేస్తున్నారా...మేం పర్శనల్ గా కూడా ఈ సినిమాని ఎవరికీ చూపించలేదు. అలాంటప్పుడు ఆ సినిమా ఎలా ఉందో ఎవరికైనా ఎలా తెలుస్తుంది. దయచేసి రూమర్స్ స్ప్రెడ్ చేయకండి.. ఎవరూ కూడా నమ్మవద్దు అని అంటున్నారు.


  ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు సభ్యులు U/A సర్టిఫికెట్ జారీ చేసారు. ఈ చిత్రాన్ని తెలుగులో 'తుఫాన్' పేరుతో విడుదల చేస్తున్నారు. ముంబైలోని సెన్సార్ బోర్డు ఈచిత్రానికి సెన్సార్ రిపోర్టు జారీ చేసింది. 2 చోట్ల సినిమాకు మైనర్ కటింగ్స్ పడ్డాయని, మొత్తం 137 నిమిషాల పాటు రన్ టైం ఉందని తెలుస్తోంది. ఈ చిత్రంలో బాలీవుడ్ టాప్ హీరోయిన్ ప్రియాంక చోప్రా రామ్ చరణ్‌తో జతకడుతోంది. రామ్ చరణ్ యాక్షన్ సన్నివేశాలు, ప్రియాంకతో చేసే రొమాంటిక్ సీన్లు సినిమాకు హైలెట్ కానున్నాయి.

  1975లో అమితాబ్ హీరోగా వచ్చిన బ్లాక్ బస్టర్ హిట్ మూవీ 'జంజీర్' చిత్రానికి రీమేక్‌గా అదే పేరుతో తెరకెక్కించారు. ఈ చిత్రంలో రామ్ చరణ్ ఏసిపీ విజయ్ ఖన్నా పాత్రలో నటించాడు. షేర్ ఖాన్ పాత్రలో హిందీలో సంజయ్ దత్, తెలుగులో శ్రీహరి పోషించగా, మోనా డార్లింగ్ పాత్రలో నటించింది. తనికెళ్ల భరణి, దేవ్ గిల్ కీలకమైన పాత్రలు పోషించారు.

  రిలయన్స్ ఎంటర్టెన్మెంట్స్, అడాయ్ మెహ్రా ప్రొడక్షన్స్, మరియు ఫ్లయింగ్ టర్టిల్ ఫిల్మ్ సంయుక్తంగా ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని నిర్మించారు. బాలీవుడ్ హీరోల ఫేవరెట్ దర్శకుడు అపూర్వ లఖియా ఈచిత్రానికి దర్శకత్వం వహించారు. ప్రియాంక చోప్రా హీరోయిన్. శ్రీహరి ఇందులో ముఖ్య పాత్ర పోషించారు. ప్రకాష్ రాజ్ క్యారెక్టర్ సినిమాకు హైలెట్ కానుంది. హిందీలో సంజయ్ దత్ పోషించిన పాత్రను తెలుగులో శ్రీహరి పోషించారు.

  English summary
  Ram charan is having too much bad time now with Bollywood media , Movie has already faced few issues in court before release and now it enters to rumors problems. Shockingly Bollywood media started publishing that Zanjeer is a flop movie. They also mention a reason that buyers who attended special screening mentioned these words and film is not a 1% compared with Amitab Bachan Zanjeer. But Reliance entertainments replied in a strong manner , Zanjeer FLOP ? What are you joking ? we never screened to any one this film pivately . So stop believing such rumors folks.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more