'మనం' పై వివాదం..సెన్సార్ చూసుకోలేదా?
హైదరాబాద్ : రిలీజైన సినిమాలలలోని సన్నివేశాలపై ఏదో వివాదం రావటం, దాని దర్శక,నిర్మాతలు దాన్ని తొలిగించుకునే ప్రయత్నం చేయటం ఈ మధ్యకాలంలో సర్వ సాధారణంగా మారింది. అక్కినేని నాగేశ్వరరావు, నాగార్జున, నాగచైతన్య కలసి నటించిన చిత్రం 'మనం'. సమంత, శ్రియ హీరోయిన్స్. విక్రమ్ కె.కుమార్ దర్శకత్వం వహించారు. అక్కినేని కుటుంబం నిర్మించింది. ఈ చిత్రం మొన్న శుక్రవారం విడుదలైంది. ఈ చిత్రంపై మతపరమైన వివాదం మొదలయ్యిందని మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. ఈ చిత్రంలోని కొన్ని సన్నివేశాలపై క్రైస్తవ మత సంఘాలు మండిపడుతున్నట్లు చెప్పుతున్నారు. అయితే అఫీషియల్ గా ఎక్కడా దీనిపై కథనాలు మాత్రం రాలేదు.
ఈ చిత్రంలోని ఎమ్ ఎస్ నారాయణ పాత్ర ...హీరో నాగచైతన్య చదివే కాలేజీ ప్రిన్స్ పాల్ పాత్ర. నాగచైతన్య ఈ ప్రిన్స్ పాల్ ని అన్ని సినిమాల్లో లాగానే ఏడిపిస్తూంటాడు. ఈ ఎపిసోడ్ లో ప్రైయిజ్ ది లార్డ్ అంటూ కొన్ని మతాన్ని గుర్తు చేసే పదాలు దొర్లాయి. ముఖ్యంగా ఆ పాత్ర... తన ప్రేమ వ్యవహారం దెబ్బ తినటంతో ఇలా ఫాధర్ గా మారి ప్రిన్స్ పాల్ ని అయ్యానని అంటాడు. అలాగే ఓ చోట నాగచైతన్య..ఈ ఫాధర్ పై కక్కుతాడు. దాంతో క్రైస్తవలు ఇలా తమ మతంలోని గురువు లాంటి ఫాధర్ ని ఇలా కామెడీ కోసం చీప్ గా చేయటం బాగోలేదని నాగార్జునని సంప్రదించారట. నాగ్ మాత్రం ఈ వివాదం హైలెట్ అవ్వకుండా దీనికి పరిష్కారం వెతికే ఆలోచనలో ఉన్నారట. అయినా సెన్సార్ బోర్డ్ ఎలా ఈ సన్నివేశాలను వదిలేసింది అంటున్నారు.

కాలంతోపాటు పద్ధతులు, నాగరికత వల్ల అలవాట్లు మారతాయేమో కానీ ప్రేమ మారదు. నిన్న, నేడు, రేపు.. ఎప్పుడైనా సరే. ప్రేమ ప్రేమే. అదే మా 'మనం' సారం. అక్కినేని,నాగార్జున, చైతన్య కలిసి నటించిన ఈ సినిమాలో సమంత, శ్రెయహీరోయిన్స్ గా నటించారు. బ్రహ్మానందం, తనికెళ్ల భరణి, అలీ, ఎమ్మెస్ నారాయణ, జయప్రకాష్ రెడ్డి, పోసాని కృష్ణ మురళి, నాగినీడు, శరణ్య, కాశీవిశ్వనాథ్, రవిబాబు, వెన్నెల కిషోర్, మెల్కొటే ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈచిత్రానికి మాటలు : హర్షవర్ధన్, పాటలు : చంద్రబోస్, వనమాలి, డాన్స్ : బృంద, ఫైట్స్ : విజయ్, కాస్ట్యూమ్స్: నళిని శ్రీరామ్, ఫోటోగ్రఫీ : పి.ఎస్.వినోద్, సంగీతం : అనూప్ రూబెన్స్, ఆర్ట్ :రాజీవన్, ఎడిటింగ్ : ప్రవీణ్ పూడి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: వై.సుప్రియ, నిర్మాత : నాగార్జున అక్కినేని, కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం : విక్రమ్ కె.కుమార్.


Click it and Unblock the Notifications











