»   »  'కిక్ -2' ఎఫెక్టు: రవితేజ,దిల్ రాజు మధ్య రెమ్యునేషన్ చిచ్చు

'కిక్ -2' ఎఫెక్టు: రవితేజ,దిల్ రాజు మధ్య రెమ్యునేషన్ చిచ్చు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : 'కిక్ -2' చిత్రం ఫ్లాప్ ఎఫెక్టు రవితేజ కెరీర్ పై పడటం మొదలైంది. ఆయన దిల్ రాజు నిర్మాతగా కమిటవ్వనున్న చిత్రానికి రెమ్యునేషన్ విషయంలో విభేదాలు వచ్చినట్లు ఫిల్మ్ నగర్ సమాచారం. కిక్ 2 కు ముందు కమిటైన రెమ్యునేషన్ ను ఇప్పుడు దిల్ రాజు ఇవ్వనంటున్నారని, తగ్గించి ఇస్తాననటంతో రవితేజ ఒప్పుకోవటం లేదని తెలుస్తోంది. ఇదంతా దిల్ రాజు నిర్మాతగా ఓహ్ మై ఫ్రెండ్ దర్శకుడు వేణు శ్రీరామ్ డైరక్షన్ లో చేయబోయే చిత్రానికి అని తెలుస్తోంది.

రవితేజ ఇప్పుడు 'బెంగాల్‌ టైగర్‌' షూటింగ్ లో బిజీగా ఉన్నారు. అదే వేడిలో తాజాగా మరో చిత్రం కమిటయ్యారు. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ఓ చిత్రం కమిటయ్యినట్లు సమాచారం. రీసెంట్ గా వేణు శ్రీరామ్ కలిసి కథ నేరేట్ చేసినట్లు తెలుస్తోంది. రవితేజ ఇప్రెస్ అయ్యి డేట్స్ ఇవ్వటానికి ముందుకు వచ్చినట్లు చెప్తున్నారు. వేణు శ్రీరామ్ గతంలో ఓహ్ మై ఫ్రెండ్ 2011 చిత్రం చేసారు. ఇన్నాళ్లకు ఈ కథని ఓకే చేసారు.

 Remuneration Issues Between Ravi Teja And Dil Raju

'బెంగాల్‌ టైగర్‌' విశేషాలకు వస్తే....

రచ్చతో దర్శకుడుగా తన సత్తా ఏంటో చూపించిన దర్శకుడు సంపత్ నంది.. దర్శకత్వం వహిస్తున్న చిత్రం 'బెంగాల్‌ టైగర్‌'. రవితేజ హీరోగా నటిస్తున్నారు. తమన్నా, రాశీ ఖన్నా హీరోయిన్స్. కె.కె.రాధామోహన్‌ నిర్మాత. ఈ నెల 8 నుంచి యూరప్‌లో చిత్రీకరణ జరగనుంది. అక్కడ కొన్ని కీలక సన్నివేశాల్ని తెరకెక్కిస్తారు. దీంతో చిత్రీకరణ పూర్తవుతుంది.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

సంపత్ నంది మాట్లాడితే... పులి పంజా విసిరిందంటే ఇక తిరుగులేనట్టే. అదే పులి ఓ పథకం ప్రకారం పంజా విసిరితే? పౌరుషమున్న ఒక పులి అదే చేసింది. మరి అక్కడ ఏం జరిగిందో తెలియాలంటే మా చిత్రం చూడాల్సిందే అంటున్నారు సంపత్‌ నంది.

దర్శకుడు కంటిన్యూ చేస్తూ.. ''పేరుకు తగ్గట్టుగా బలమైన కథతో రూపొందుతున్న చిత్రమిది. యాక్షన్‌, భావోద్వేగాలు, వినోదం మేళవించి చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాం. రవితేజ హుషారైన నటన చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. బెంగాల్‌ టైగర్‌ అంత పవర్‌ రవితేజ పాత్రలో కనిపిస్తుంది'' అన్నారు.
''చిత్రీకరణ తుదిదశకు చేరుకొంది. రవితేజ శైలి మాస్‌ అంశాలతో దర్శకుడు సంపత్‌ నంది చిత్రాన్ని తీర్చిదిద్దుతున్న విధానం చాలా బాగుంది. మా సంస్థలో నిలిచిపోయే ఓ మంచి చిత్రమవుతుంది'' అన్నారు నిర్మాత.

English summary
Director Venu Sriram of Oh My Friend fame is in talks with actor Ravi Teja for a yet-untitled Telugu project that is expected to go on the floors next year. "Venu is currently busy giving final touches to the script. Ravi gave his consent after listening to a few lines of the story. If all goes as planned, the project may happen next year," a source from the film's unit revealed. The film will be produced by Dil Raju, who had also bankrolled Sriram's directorial debut Oh My Friend.
Please Wait while comments are loading...