For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  'గోవిందుడు అందరివాడేలే' లో చరణ్ ఇంట్రడక్షన్ సీన్ ఇదే

  By Srikanya
  |

  హైదరాబాద్ : రామ్‌చరణ్‌,క్రియేటివ్‌ దర్శకుడు కృష్ణవంశీ కాంబినేషన్లో తెరకెక్కిన చిత్రం 'గోవిందుడు అందరివాడేలే'. కృష్ణవంశీ మార్కుకు తగ్గట్టుగానే భారీ తారాగణంతో ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ చిత్రం లో హీరో ఇంట్రడక్షన్ సీన్ సైతం చాలా ఆసక్తిగా ఉంటుందవి అంటున్నారు. ఈ సీన్ లండన్ లో జరుగుతుంది. రామ్ చరణ్ అక్కడ రగ్బీ ఆడుతూ పరిచయమవుతారు. ఈ సీన్ అద్బుతంగా వచ్చిందని యూనిట్ అంటోంది. దాదాపు ఇరవై ఐదు శాతం లండన్ లో షూట్ చేసారు.

  ఈ విషయమై కృష్ణ వంశి సైతం చాలా ఎగ్జైంటింగ్ గా ఉన్నారు. కృష్ణ వంశి మాట్లాడుతూ..." దాదుపు 25% సినిమాని UK లో చిత్రీకరించాం. అక్కడ ఎలా హీరో టైమ్ స్పెండ్ చేస్తాడు... ఎలా అక్కడ జీవిస్తున్నాడు...అతను ఏం చదవుతున్నాడు వంటివన్ని ప్రస్తావిస్తాం. అలాగే నేను తొలిసారిగా రగ్బీ ని షూట్ చేసాను. నాకు ఆ ఆట గురించి పెద్దగా తెలియదు.. అయితే కొంత ఇన్ఫర్మేషన్ గేదర్ చేసి ఈ ఆటను చిత్రీకరించాం. ఇంతకుముందు వేరే ఆటలు తీసాను కానీ ఇలాంటి ఛాలెంజ్ తో కూడినది ఎప్పుడూ తీయలేదు..ఇది ఫన్ గా ఉంది ." అన్నారు. కాజల్‌ అగర్వాల్‌ హీరోయిన్‌. పరమేశ్వర ఆర్ట్స్‌ పతాకంపై బండ్ల గణేష్‌ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రంలో రామ్‌చరణ్‌కు తాతగా ప్రకాష్‌రాజ్‌ నటిస్తున్నారు.

  రామ్‌చరణ్‌ మాట్లాడుతూ... 'ఆరెంజ్‌' తర్వాత ప్రేమకథ నేపథ్యంలో సినిమా చేయలేదు. చేస్తే కృష్ణవంశీతోనే చేయాలనుకున్నాను. ఈలోగా చాలా అవకాశాలు వచ్చాయి. కానీ ఏదీ ఒప్పుకోలేదు. ఈ సినిమా నేను చేయకపోతే కుటుంబ ప్రేక్షకులకు దూరమయ్యేవాడిని. తెలుగు సినిమా ఆస్తి కృష్ణవంశీ. ప్రకాష్‌రాజ్‌, జయసుధ సినిమాలోకి వచ్చాకే పరిపూర్ణత వచ్చింది. ఏటీఎం పాత్ర చూసినప్పటి నుంచి శ్రీకాంత్‌గారి ఫ్యాన్‌ని. ఆయన నాకు మరో బాబాయి. మేమంతా కలసి మంచి సినిమా తీశాం. అభిమానులందరికీ నచ్చుతుందనే నమ్మకం ఉంది'' అన్నారు.

  Revealed: Ram Charan's Introduction in GAV

  కృష్ణవంశీ మాట్లాడుతూ '' ఒకసారి చరణ్‌ మేనేజర్‌ను కలసి చరణ్‌తో పది నిమిషాలు మాట్లాడాలని అడిగాను. వెంటనే చరణ్‌ పిలిపించాడు. నేను వెళ్లగానే అతను నాపై చూపించిన గౌరవం చూసి నేనింకా చచ్చిపోలేదు అనిపించింది. 20 నిమిషాలు నా ఆలోచనలను చరణ్‌కు చెప్పాను. వెంటనే మనం సినిమా చేద్దాం అన్నాడు. అన్నయ్య కూడా అలాగే ప్రోత్సహించారు. వెయ్యేనుగుల బలం అంటే ఏమిటో అప్పుడే తెలిసింది. ప్రపంచంలో చాలా అరుదుగా కనిపించే లక్షణం సంస్కారం. దాన్ని చరణ్‌లో చూశాను. అన్నయ్యే అలా తయారు చేశాడు. ఓ చక్కనైన, చిక్కనైన, అందమైన తెలుగు సినిమా ఇది. కనీసం 50 ఏళ్లపాటు దీని గురించి చెప్పుకుంటారు. ఇది అతివిశ్వాసంతో చెపుతున్న మాట కాదు. ఆత్మవిశ్వాసంతో చెప్తున్న మాట'' అన్నారు.

  ప్రకాష్‌రాజ్‌ మాట్లాడుతూ ''ఆహ్లాదకరమైన ప్రచార చిత్రాన్ని చూశాను. ఈ మధ్య కొన్ని కారణాల వల్ల నేను కృష్ణవంశీ సినిమాలకు దూరమయ్యాను. ఇప్పుడు నా అదృష్టం కొద్ది కృష్ణవంశీనే నన్ను పిలిచి ఈ పాత్ర ఇచ్చాడు'' అన్నారు. దసరాకు (అక్టోబర్‌1)న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నామని నిర్మాత చెప్పారు.

  English summary
  Ram Charan will be introduced through a Rugby match in Hemel Hempstead in Hertfordshire in Eastern England. Charan is said to be a Rugby player and star in his team.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X