For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  'రక్త చరిత్ర' క్రేజ్ ని మళ్లీ క్యాష్ చేసుకుందామనే..

  By Srikanya
  |

  హైదరాబాద్ : రామ్ గోపాల్ వర్మ ప్రస్తుతం సీక్వెల్స్ మీద దృష్టి పెట్టి వరసగా అవే తీస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఆయన తన హిట్ 'రక్త చరిత్ర' కు మరో సీక్వెల్ తీయాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఈ మేరకు ఆయన స్క్రిప్టుని రెడీ చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే అది టైటిల్ కు మాత్రమే సీక్వెల్ అని, కథ సీక్వెల్ కాదని అంతర్గత వర్గాల సమాచారం. రక్త చరిత్రకు ఉన్న క్రేజ్ ని మరోసారి క్యాష్ చేసుకుందామనే ఆలోచన వర్మది అని టాలీవుడ్ సర్కిల్స్ లో చెప్పుకుంటున్నారు. 'రక్త చరిత్ర -1 ' హిట్టైనా,భాక్సాఫీస్ వద్ద 'రక్త చరిత్ర-2' డిజాస్టర్ అయ్యింది. సూర్య ని హీరోగా పెట్టి ఆ చిత్రం చేసారు.

  ప్రస్తుతం వర్మ తన తాజా చిత్రం ఐస్ క్రీమ్ 2 విడుదల మీద దృష్టి పెట్టారు. జేడీ చక్రవర్తి, నవీన ప్రధాన పాత్రల్లో రాంగోపాల్‌వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం 'ఐస్‌ క్రీం-2'. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం నవంబర్ 7 న విడుదల చేయనున్నారని ప్రకటించారు. అయితే తాజాగా అందుతున్న సమచారాన్ని బట్టి ఆ తేదీని మార్చినట్లు తెలుస్తోంది. నవంబర్ 21న చిత్రాన్ని విడుదల చేస్తారని అంటున్నారు. 'ఐస్‌ క్రీం-2' రాంగోపాల్‌వర్మ శైలిలో సాగే సినిమా అని చిత్ర యూనిట్‌ పేర్కొంది.

  ఈ సీక్వెల్ చిత్రాన్ని సైతం వర్మ నాన్‌స్టాప్ షెడ్యూల్‌తో షూటింగ్ పూర్తి చేసామని చెప్తున్నారు, ప్రస్తుతం ప్రి ప్రొడక్షన్ పనిలో నిమగ్నమయ్యారు. ఈ చిత్రం సైతం లో బడ్జెట్ లో పూర్తి చేసినట్లు చెప్తున్నారు. టైటిల్‌కు తగ్గట్లుగానే వర్మ ఇప్పటివరకూ తీసిన చిత్రాలకు భిన్నంగా ఈ సినిమా ఉంటుందని అంటున్నారు. ఫ్లోకామ్‌తో చిత్రీకరించిన సన్నివేశాలను చూసిన ప్రేక్షకులు సరికొత్త అనుభూతి పొందుతారని యూనిట్ సభ్యులు చెప్పారు.

  RGV again sequel to Rakta Charithra movie

  అలాగే...ఐస్ క్రీమ్ 2 చిత్రంలో ఓ పాటలో నటింప చేసేందుకు ఒత్తిడి తీసుకువచ్చారని, వేధించారని సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని ఆ చిత్ర హీరోయిన్ నవీన ఖండించారు. పాట చిత్రీకరణకు ముందే దర్శకుడు రాంగోపాల్ వర్మ తనతో చర్చించారని నవీన ఓ ఇంగ్లీష్ వెబ్ సైట్ కు ఇచ్చిన ఇంటర్వూలో వెల్లడించింది.

  రాము గారు ఎన్నడూ వేధించలేదు.. బలవంత పెట్టలేదు, ఒత్తిడి చేయలేదు అని ఆమె అన్నారు. షూటింగ్ కు ముందే పాట గురించి వివరించారని.. ఆతర్వాత తాను చేయడానికి ఒప్పుకున్నానని నవీన స్పష్టం చేశారు. అశ్లీలానికి, గ్లామర్ కు ఓ చిన్న విభజన రేఖ ఉందన్నారు. నటిగా ఓ కొత్తదనం కోసం ప్రయత్నించాను. అయితే ఆపాట అంతగా అశ్లీలమనిపించలేదు.. ఒకవేళ అలా అనిపిస్తే తాను చేయడానికి నిరాకరించేదాన్ని అన్నారు.

  నిర్మాత తుమ్మలపల్లి రామ సత్యనారాయణ మాట్లాడుతూ.. జీనియస్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ‘ఐస్ క్రీమ్ 2′ చిత్రాన్ని అత్యద్భుతంగా రూపొందించారు. హారర్ తో పాటు గ్లామర్ కూడా పుష్కలంగా ఉన్న చిత్రమిది. ' అన్నారు.

  ఈ చిత్రంలో జె.డి.చక్రవర్తి, నందు, భూపాల్, సిద్ధు, ధనరాజ్, నవీన, శాలిని, గాయత్రిలు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. గతంలో వచ్చిన ‘ఐస్ క్రీం' చిత్రానికి ఇది సీక్వెల్. ‘ఐస్ క్రీమ్' చిత్రాన్ని రెండే రెండు మెయిన్ క్యారెక్టర్స్‌తో ఒకే ఒక ఇంటిలో షూట్ చేసారు. ‘ఐస్ క్రీమ్-2'ను మొత్తం ఔట్ డోర్ లో పదహారు ప్రధాన పాత్రలతో తీసారు. కథాపరంగా రెంటికీ సంబంధం లేదని చిత్ర యూనిట్ తెలిపారు. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్ : తుమ్మలపల్లి అంజని కుమార్ - టి భరత్ కుమార్, నిర్మాత : తుమ్మలపల్లి రామ సత్యనారాయణ, కథ - స్క్రీన్ ప్లే - మాటలు - దర్శకత్వం : రామ్ గోపాల్ వర్మ!

  English summary
  After’ Ice Cream’ sequel Varma is now in plans on making a sequel to his film ‘Rakta Charithra 2’.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X