రామ్ గోపాల్ వర్మ దర్సకత్వంలో రామ్ చరణ్ తేజ చిత్రం టైటిల్ ఏంటంటే
ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ త్వరలో రామ్ చరణ్ తేజని డైరక్ట్ చేసే అవకాశం ఉందంటూ ఫిల్మ్ సర్కిల్స్ లో వినిపిస్తోంది. ఆ చిత్రం టైటిల్ 'శివుడు'అని పెట్టినట్లు ఇప్పటికే స్క్రిప్టు వర్క్ స్టార్టయినట్లు చెప్తున్నారు.అలాగే వర్మ ఇప్పటికే రామ్ చరణ్ ని కలిసి ఈ విషయమై రెండు మూడు సిట్టింగ్స్ జరిపినట్లు చెప్తున్నారు.అన్నీ అనుకూలిస్తే సెప్టెంబర్ లో సినిమాను సెట్స్ ఫై కి తెచ్చే అవకాశాలు ఉందని సమాచారం.
చిరంజీవి కూడా దానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని,అయితే సినిమా ప్రారంభమయ్యే దాకా ఈ విషయమై ఎక్కడా రాకూడదనే కండిషన్ పెట్టారని చెప్పుకుంటున్నారు.అలాగే గతంలో చిరంజీవి తో ఒక సినిమా మొదలుపెట్టి మద్యలో ఆపేసాడు, అలాగే ఈ మద్య ఆయనతో 'దొర- ది లార్డ్' అనే సినిమా తియ్యాలని ఉంది ట్విట్టర్ లో రాసుకొచ్చాడు.ఇక వర్మ ప్రస్తుతం నాగచైతన్య హీరోగా బెజవాడ రౌడీలు చిత్రాన్ని నిర్మిస్తున్నారు.


Click it and Unblock the Notifications











