»   »  వర్మ 'పట్టపగలు'లో రాజ శేఖర్ లుక్ (ఫోటో)

వర్మ 'పట్టపగలు'లో రాజ శేఖర్ లుక్ (ఫోటో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : రామ్ గోపాల్ వర్మ వరస ఫ్లాపుల హీరో రాజశేఖర్ తో పట్టపగలు చిత్రం చేస్తున్నారు అనే సంగతి తెలిసిందే. పూర్తి హర్రర్ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో స్వాతి దీక్షిత్ హీరోయిన్ గా చేస్తోంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసిన ఈ చిత్రంలో రాజశేఖర్ విభిన్నంగా తన నేచురల్ లుక్ లో కనిపించనున్నారని తెలుస్తోంది. మీరు చూస్తున్న ఫోటో ఆ సెట్స్ మీదదే. అలాగే ఈ చిత్రం 'రాత్రి' కి సీక్వెల్ అని తెలుస్తోంది.

పట్టపగలు అనే టైటిల్ తో చిత్రం చేస్తానని వర్మ చాలా కాలంగా భయపెడ్తున్నారు. అది త్వరలోనే మన ముందుకు రానుందని తెలుస్తోంది. దాదాపు 15 రోజులు రెగ్యులర్ షూటింగ్ లో ఈ చిత్రం ఫినిష్ చేసాడని,త్వరలోనే విడుదల చేస్తున్నాడని వినికిడి. ఈ మేరకు ఎడిటింగ్ వర్క్ ప్రారంభమయ్యిందని అంటున్నారు. అయితే మీడియాకు ఈ విషయం లీక్ కాకుండా చాలా జాగ్రత్తలు తీసుకుని మేనేజ్ చేసాడని,కొంతమంది మీడియా మిత్రలుకు తెలిసినా దాన్ని బయిటకు రానివ్వకుండా వర్మ రిక్వెస్ట్ చేసాడని అంటున్నారు. ఇద్దరూ ప్లాప్ లలో ఉన్నారు కాబట్టి హిట్ వచ్చే అవకాసం ఉందని అంటున్నారు.

 RGV Pattapagalu's Film first look

మరో ప్రక్క రామ్ గోపాల్ వర్మ దర్శకుడుగా,మోహన్ బాబు నిర్మాతగా చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. వీరిద్దరి కాంబినేషన్ లో ఓ చిత్రం ప్రారంభమై, ఆ మేరకు షూటింగ్ జోరుగా జరుగుతోంది. ఈ చిత్రానికి 'రౌడీ' అనే టైటిల్ పెట్టారు. ఈ సినిమాని రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో పవర్ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిస్తున్నారు.

English summary
Raja Sekhar is going through a rough phase in personal as well as career front . No producer is coming forward to make a film with him and he accepted the movie without any hesitation.After getting Rajashekar approval Ramu started shooting immediately and not revealed this information to media and shot the entire film in 15 days clandestinely.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu